SP-AAP Alliance: దేశం మొత్తం ఉత్తర ప్రదేశ్ ఎన్నికల వైపు ఆసక్తి కనబరుస్తుంటుంది. అందుకే ఏడాది ముందే ఎన్నికల వేడి మొదలైపోయింది. పార్టీల మధ్య పొత్తు రాజకీయాలు ప్రారంభమయ్యాయి. రానున్న యూపీ ఎన్నికల్లో ఆప్, సమాజ్‌వాది పార్టీల మధ్య పొత్తు యత్నాలు జరుగుతున్నాయి.
ఉత్తర ప్రదేశ్ ఎన్నికలు 2022లో(Uttar pradesh Elections 2022) జరగనున్నాయి. వివిధ పార్టీల మధ్య అప్పుడే పొత్తు ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. యూపీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(AAP) తో సమాజ్‌వాది పార్టీ జతకట్టే సూచనలు కన్పిస్తున్నాయి. ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని గతంలో చెప్పిన సమాజ్‌వాదీ పార్టీ అధినేత వైఖరిలో మార్పు రావడమే దీనికి కారణం. సమాజ్‌వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఢిల్లీలో..ఆప్‌కు చెందిన ఎంపీ సంజయ్ సింగ్‌తో భేటీ దీనికి కారణంగా తెలుస్తోంది. బీజేపీ అనుసరిస్తున్న విధానాలపై చర్చించినట్టు భేటీ అనంతరం ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ వెల్లడించినా..అసలు సంగతి మాత్రం పొత్తు రాజకీయాలపైనేననేది సమాచారం.
ఉత్తర ప్రదేశ్‌లో జరిగిన జిల్లా పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ (BJP)విజయం సాధించింది. అయితే ఆ పార్టీ ఓటర్లను కిడ్నాప్ చేసిందని..ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకుందనేది అఖిలేష్ యాదవ్ (Akhilesh yadav) ఆరోపణ. ఓటమిని గెలుపుగా మార్చుకునేందుకు పోలీసుల్ని వినియోగించుకుని..కిడ్నాప్ చేసిందన్నారు. ప్రజాస్వామ్య విలువల్ని బీజేపీ అపహాస్యం చేసిందని విమర్శించారు.యూపీ స్థానిక పోరులో ఎస్పీ(SP) కేవలం 5 స్థానాల్ని గెల్చుకోగా..రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్, ఇండిపెండెంట్‌లు ఒక్కొక్క స్థానాన్ని గెల్చుకున్నారు. బీజేపీ ఏకంగా 67 స్థానాల్లో విజయం సాధించింది. మొత్తం 75 స్థానాలకు జరిగిన ఆ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ కేవలం 5 స్థానాలను గెలుచుకోగా..రాష్ట్రీయ లోక్‌దళ్, జనతాదళ్, ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కొక్క స్థానాన్ని గెలుచుకున్నారు. బీజేపీ 67 స్థానాల్లో విజయం సాధించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్ని స్థానిక పోరు ఫలితాలు ప్రతిబింబించాయని..అసెంబ్లీ ఎన్నికల్లో సైతం తమదే విజయమని ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ (Yogi Adityanath) ధీమా వ్యక్తం చేశారు.
Also read: India Covid-19 Vaccination: ఇండియాలో 35 కోట్లు దాటిన కరోనా వ్యాక్సినేషన్ డోసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook