Parliament: వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు (parliament for monsoon session)  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.

Last Updated : Aug 17, 2020, 11:43 AM IST
Parliament: వర్షాకాల సమావేశాలకు ప్రత్యేక ఏర్పాట్లు

special arrangements in parliament: న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనావైరస్‌ ( Coronavirus ) వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ( parliament for monsoon session)  ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో జూలై 17న పార్లమెంట్ వర్షాకాల సమావేశాలపై లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ( Om Birla ), రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్యనాయుడు ( M. Venkaiah Naidu ) చర్చించారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కల్లా.. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సభ్యుల మధ్య భౌతిక దూరం ఉండేలా.. లోక్‌సభ, రాజ్యసభలో చాంబర్లు, గ్యాలరీలను కూడా వినియోగించుకోవాలని నిర్ణయించారు. ఆగస్టు మూడో వారం నాటికి ఏర్పాట్లు పూర్తిచేయాలని అధికారులకు ఆదేశించారు. Also read: Dhoni's Farewell Match: మహీ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ రాంచీలో నిర్వహించండి: సీఎం సోరెన్‌

ఈ మేరకు రాజ్యసభ ఎంపీలకు లోక్‌సభలో సీటింగ్‌ ఏర్పాటు చేశారు. అలాగే రేడియేషన్ పద్ధతి ద్వారా ఆల్ట్రా వైలెట్ కిరణాలను ప్రసరింపచేసి వైరస్‌ను తుదముట్టించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా.. పార్లమెంట్‌లోని 4 గ్యాలరీలల్లో మరో ఆరు చిన్న తెరలను ఏర్పాటు చేస్తున్నట్లు రాజ్యసభ కార్యదర్శి పేర్కొన్నారు. సభలో ఆడియో సిస్టంతోపాటు.. చాంబర్లు, గ్యాలరీలను వేరు చేసేందుకు పాలికార్బోనేట్ షీట్‌లు వినియోగిస్తున్నట్లు కార్యదర్శి తెలిపారు. కాగా.. ఇలాంటి ఏర్పాట్లు పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారని రాజ్యసభ కార్యదర్శి వివరించారు. ఇదిలాఉంటే.. సెప్టెంబరు మూడో వారం నుంచి పార్లమెంట్ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటివరకు దీనిపై ఎలాంటి ప్రకటన వెలువడలేదు. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

Trending News