Dhoni's Farewell Match: మహీ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ రాంచీలో నిర్వహించండి: సీఎం సోరెన్‌

భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni )  అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్‌కు శనివారం రిటైర్మెంట్ ( dhoni retirement)  ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ధోనీ అభిమానులు నిరాశకు గురై సోష‌ల్ మీడియా వేదికగా త‌మ తమ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. 

Last Updated : Aug 16, 2020, 04:01 PM IST
Dhoni's Farewell Match: మహీ ఫేర్‌వెల్‌ మ్యాచ్‌ రాంచీలో నిర్వహించండి: సీఎం సోరెన్‌

CM Hemant Soren appeal BCCI: న్యూఢిల్లీ: భారత క్రికెట్ మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ( MS Dhoni )  అంతర్జాతీయ క్రికెట్ ఫార్మట్‌కు శనివారం రిటైర్మెంట్ ( dhoni retirement)  ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ధోనీ అభిమానులు నిరాశకు గురై సోష‌ల్ మీడియా వేదికగా త‌మ తమ అభిప్రాయాల‌ను వ్య‌క్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధోని రిటైర్మెంట్ ప్రకటించిన తరువాత జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ( Hemant Soren )  సైతం ఒక‌ ట్వీట్ చేసి బీసీసీఐ ( BCCI ) కి ఒక విజ్ఞప్తి చేశారు. 

‘‘దేశం, జార్ఖండ్ గర్వించదగ్గ ఆటగాడు ధోనీ, మనందరికీ ఎన్నో మరపురాని జ్ఞాపకాలను అందించి ఈ రోజు అంతర్జాతీయ క్రికెట్ కెరిర్ నుంచి రిటైర్ అయ్యారు. ఝార్ఖండ్‌ ధోనీని ఇకపై నీలిరంగు జెర్సీలో చూడలేం. దేశ ప్రజల హృదయాలు ఇంకా నిండిపోలేదు. రాంచీలో మా మహీకి వీడ్కోలు మ్యాచ్‌ ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. దీనికి ప్రపంచం మొత్తం సాక్ష్యంగా నిలుస్తుంది. మహీ కోసం ఝార్ఖండ్‌ ఆతిథ్యం ఇవ్వబోయే వీడ్కోలు మ్యాచ్‌ను బీసీసీఐ నిర్వహించాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా’’ అని ఆయన ట్వీట్‌ చేశారు. Also read: MS Dhoni retirement: సాక్షి ఎమోషనల్ పోస్ట్

భారత స్టార్ క్రెకెటర్ మహేంద్ర సింగ్ ధోనీ 1981 జూలై 7న రాంచీ ( Ranchi) లో జన్మించారు. అయితే.. ధోనీ రిటైర్మెంట్‌ ప్రకటించిన అనంతరం హేమంత్‌ సోరెన్‌ ట్విటర్లో బీసీసీఐకి ఇలా విజ్ఞప్తి చేశారు. అయితే సీఎం చేసిన ఈ విజ్ఞప్తికి  ధోని అభిమానులంతా మద్దతు తెలుపుతున్నారు.  Also read: Dhoni Retirement: ఎంఎస్ ధోనీ కెరీర్ ఎలా మొదలైందో అలాగే ముగిసింది

Trending News