దేశంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు..!!

'కరోనా వైరస్' రోజూ వందల  కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఉంది. చైనా మహమ్మారి దెబ్బకు రోజూ భారత దేశంలో 150కి పైగానే జనం మృత్యుకౌగిట చిక్కుకుంటున్నారు.

Last Updated : May 27, 2020, 10:02 AM IST
దేశంలో లక్షా 50 వేలు దాటిన కరోనా కేసులు..!!

'కరోనా వైరస్' రోజూ వందల  కుటుంబాల్లో విషాదం నింపుతోంది. రోజు రోజుకు పెరుగుతున్న పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్యతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త వాతావరణం ఉంది. చైనా మహమ్మారి దెబ్బకు రోజూ భారత దేశంలో 150కి పైగానే జనం మృత్యుకౌగిట చిక్కుకుంటున్నారు.

కరోనా వైరస్ దేశవ్యాప్తంగా విలయ  తాండవం చేస్తోంది. మహమ్మారి వైరస్ కారణంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఇప్పటికే లక్షా 50 వేల  మార్క్ దాటింది. మొత్తంగా లక్షా 51 వేల 767 కేసులు నమోదయ్యాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇందులో 83 వేల 4 కేసులు యాక్టివ్ గా ఉన్నాయనిి తెలిపింది. మరోవైపు కరోనా వైరస్ మహమ్మారికి  చికిత్స తీసుకుని సురక్షితంగా ఇంటికి చేరిన వారి సంఖ్య 64 వేల 425గా ఉంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4 వేల 337 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు.

గత 24 గంటల్లో కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది. నిన్న ఒక్క రోజే 6 వేల 387 కొత్త పాజిటివ్ కేసులు నమోదయయ్యాని కేంద్ర, వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. అంతే కాదు నిన్న ఒక్క రోజే 170 మంది కరోనా మహమ్మారికి బలయ్యారు. బీహార్, పశ్చిమ బెంగాల్, అసోం, ఒడిశా రాష్ట్రాల్లో కొత్త కేసులు ఎక్కువగా నమోదైనట్లు తెలుస్తోంది. 

మరోవైపు దేశంలో రికవరీ రేటు బాగుందని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. గత మార్చి నుంచి ఇప్పటి వరకు రికవరీ రేటులో 7.1 శాతం పెరుగుదల కనిపించిందని వివరించింది. ప్రస్తుతం రికవరీ రేటు 41.6  శాతం ఉండడం శుభపరిణామమని వెల్లడించింది.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News