SSB Constable Recruitment 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఖాళీలు.. 10వ తరగతి అర్హతతోనే దరఖాస్తు..

కేంద్ర బలగాలలో ఒకటైన సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్ మెంట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చే సహస్త్ర సీమ బల్ విభాగంలో 1522 పోస్టులను భర్తీ చేయనున్నారు.

Last Updated : Dec 9, 2020, 10:48 PM IST
  • కేంద్ర బలగాలలో ఒకటైన సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల.
  • కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చే సహస్త్ర సీమ బల్ విభాగంలో 1522 పోస్టుల భర్తీ
  • సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ అభ్యర్థుల కనీస అర్హతలు, వయసు పరిమితి, దరఖాస్తు విధానం, దరఖాస్తు రుసుం, ఎంపికైన వారికి లభించే వేతనం, ఇతర వివరాలు..
SSB Constable Recruitment 2020: ఎస్ఎస్‌బిలో 1522 ఖాళీలు.. 10వ తరగతి అర్హతతోనే దరఖాస్తు..

న్యూ ఢిల్లీ: కేంద్ర బలగాలలో ఒకటైన సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర హోంశాఖ పరిధిలోకి వచ్చే సహస్త్ర సీమ బల్ విభాగంలో 1522 పోస్టులను భర్తీ చేయనున్నారు. డ్రైవర్, ల్యాబ్ అసిస్టెంట్, వెయిటర్, కుక్, గార్డెనర్, ప్లంబర్, కార్పెంటర్, క్లీనర్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నట్టు కేంద్ర హోంశాఖ ఈ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ssb.nic.in అధికారిక వెబ్‌సైట్‌లోకి లాగిన్ అయి SSB Constable Recruitment 2020 లింకుపై క్లిక్ చేసి ఆన్ లైన్ ద్వారానే దరఖాస్తు చేసుకోవచ్చు.

SSB Constable Recruitment 2020 దరఖాస్తుకు డిసెంబర్ 20 చివరి తేదీ కాగా.. నోటిఫై అయిన మారుమూల ప్రాంతాలకు చెందిన అభ్యర్థులు డిసెంబర్ 27వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు కేంద్ర హోంశాఖ వీలు కల్పించింది.

సహస్త్ర సీమ బల్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌లో ఎంపికైన అభ్యర్థులకు 7వ పే కమిషన్ ప్రకారం మ్యాట్రిక్స్-3 లెవెల్‌కి అనుగుణంగా రూ 21,700 నుంచి రూ 69,100 వేతనం లభిస్తుంది. వేతనంతో పాటు డియర్‌నెస్ అలవెన్స్‌, రేషన్ మనీ అలవెన్స్, వాషింగ్ అలవెన్స్ ( Dearness allowance, Ration Money Allowance and Washing allowance ) కూడా అందనుంది. న్యూ పెన్షన్ స్కీమ్ వర్తించనుండటం వల్లే వారికి ఈ అలవెన్సులు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

Also read : Salary Reduce from 2021: వచ్చే ఏడాది మీ జీతం తగ్గవచ్చు.. ఎందుకో తెలుసా!

SSB Constable Recruitment 2020 age limit and age relaxation: వయస్సు పరిమితి, మినహాయింపులు ఏంటి ?
27 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు కాగా.. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్ల వయస్సు మినహాయింపు ఉంది. అలాగే ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్ల వయస్సు మినహాయింపు వర్తిస్తుంది.

SSB Constable Recruitment 2020 application fee: ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ అప్లికేషన్ ఫీజు వివరాలు..
అన్ రిజర్వ్‌డ్, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు వారు, ఓబీసీ ( UR, EWS, OBC ) వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.100 ఫీజు చెల్లించాల్సి ఉండగా.. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్‌మెన్, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా దరఖాస్తు ఫీజు చెల్లించవచ్చు. 

SSB Constable Recruitment 2020 qualification: ఎస్ఎస్‌బీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అవసరమైన అర్హతలు..
కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండటంతో పాటు పోస్టుల వారీగా పలు ట్రేడ్ టెస్టులలో సర్టిఫికెట్ కలిగి ఉండటం, వృత్తిలో రెండేళ్ల అనుభవం వంటివి అవసరం.

Also read SBI Jobs: ఎస్బీఐలో 2000 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, అర్హతలు, ముఖ్యమైన తేదీల వివరాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

సోషల్ మీడియాలో జీ హిందుస్థాన్ పేజీలను సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News