ఆధార్ కార్డు తప్పనిసరి.. తప్పనిసరి కానివి

ఆధార్ కార్డు తప్పనిసరి.. తప్పనిసరి కానివి

Last Updated : Sep 26, 2018, 12:42 PM IST
ఆధార్ కార్డు తప్పనిసరి.. తప్పనిసరి కానివి

ఆధార్ వ్యక్తిగత గోప్యతపై సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఆధార్ సంఖ్య ప్రత్యేకమైనది, దీనికి నకిలీ తయారు చేయలేమని పేర్కొంది. ఇదే ఇతర ధ్రువీకరణలకు, ఆధార్‌కు తేడా అని జస్టిస్ ఏకే సిక్రీ పేర్కొన్నారు. తక్కువ డేటాను మాత్రమే తీసుకుంటారని, ఇది కూడా సర్వర్లలో నిక్షిప్తం అవుతుందని అన్నారు. టెలికాం సహా ఏ ప్రవేట్ కంపెనీ కూడా ఆధార్‌ను అడగొద్దని సుప్రీం తెలిపింది. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57 రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంది. చట్టబద్ధం కానీ వలసదారులు ఆధార్‌ను పొందే విషయంలో ప్రభుత్వాలు జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేసింది.

జస్టిస్ ఏకే సిక్రీ "బలమైన డేటా రక్షణ చట్టాలను సాధ్యమైనంత త్వరలో ప్రవేశపెట్టమని కేంద్రాన్నిఅడిగారు. 'విద్య మనల్ని వేలిముద్ర నుండి సంతకం వరకు తీసుకెళ్తే.. టెక్నాలజీ మనల్ని సంతకం నుండి వేలిముద్రకు తీసుకొచ్చింది' సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. జస్టిస్ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ఆధార్ గోప్యతా హక్కును ఉల్లంఘిస్తోందని అన్నారు.

తప్పనిసరి

  • పాన్ కార్డుకి ఆధార్ తప్పనిసరి.
  • ఆదాయ పన్ను వివరాల కోసం ఆధార్ ఉండాలి. ఇన్‌కమ్ ట్యాక్స్ ఫైలింగ్ సమయంలో ఆధార్ సంఖ్యను వెల్లడించాలి.

 
తప్పనిసరి కానివి

  • స్కూల్ అడ్మిషన్‌కి ఆధార్ తప్పనిసరి కాదు.
  • టెలికాం కంపెనీలు ఆధార్‌ను అడగొద్దు.
  • బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడానికి ఆధార్ అక్కర్లేదు.
  • యూజీసీ, నీట్, సీబీఎస్ఈ పరీక్షలకు ఆధార్ తప్పనిసరి కాదు.
  • కొత్త సిమ్ కార్డుకు ఆధార్ తప్పనిసరి కాదు.
  • ప్రవేట్ కంపెనీలు ఆధార్ డేటాను పొందలేవు.

 

 

 

 

Trending News