Right to protest: నిరసన హక్కు ఎప్పుడూ ఉంటుందని భావించవద్దు: సుప్రీంకోర్టు

Right to protest: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా. రాజ్యాంగం ఆ హక్కును ఎల్లప్పటికీ ఇవ్వలేదా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అదే చెబుతున్నాయి. నిరసన తెలిపే హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

Last Updated : Feb 13, 2021, 01:46 PM IST
  • నిరసన హక్కు రైట్ టు ప్రొటెెస్ట్ విషయంలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
  • నిరసన తెలిపే హక్కు ఎప్పుడూ ఎల్లవేళలా ఉంటుందనుకోవడం సరైంది కాదని చెప్పిన సుప్రీంకోర్టు
  • 12 మంది పౌరహక్కుల ఉద్యమకారులు దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు
Right to protest: నిరసన హక్కు ఎప్పుడూ ఉంటుందని భావించవద్దు: సుప్రీంకోర్టు

Right to protest: ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు లేదా. రాజ్యాంగం ఆ హక్కును ఎల్లప్పటికీ ఇవ్వలేదా..సుప్రీంకోర్టు వ్యాఖ్యలు అదే చెబుతున్నాయి. నిరసన తెలిపే హక్కుపై సుప్రీంకోర్టు కీలకమైన వ్యాఖ్యలు చేసింది.

ప్రభుత్వాలు తీసుకొచ్చిన చట్టాలకు వ్యతిరేకంగా నిరసన తెలిపే హక్కు ( Right to protest ) విషయంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ప్రజాస్వామ్యంలో ఒక చట్టానికి వ్యతిరేకంగా నిరసన తెలపడం ప్రాథమిక హక్కే కానీ, ఆ కారణంతో రహదారుల దిగ్బంధనం చేయడం ఆందోళనకరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో నిరసనలు తెలుపుతూ ప్రజా రవాణాకు ఇబ్బందులు కలగజేయడం సరైన పద్దతి కాదని అభిప్రాయపడింది. నెలల తరబడి రోడ్లపై ధర్నాలు, దీక్షలు చేయడం ప్రజలు హక్కులకు హరించడమేనని స్పష్టం చేసింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం ( Citizenship amendment act ), రైతు చట్టాల ( New farm laws )కు వ్యతిరేకంగా ఢిల్లీలో జరిగిన నిరసన దీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. 

ప్రజలకు ఇబ్బంది కలగని ప్రాంతంలోకి తమ నిరసనల కేంద్రాన్ని మార్చుకోవాలని వ్యతిరేక ఆందోళనకారులకు ఆదేశించింది. నిరసన తెలిపే హక్కు ఉంటుందని కానీ దానిపేరుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని స్పష్టం చేసింది. గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ 12 మంది పౌరహక్కుల ఉద్యమకారులు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఎస్‌కే కౌల్‌, అనురుద్‌ బోస్‌, కృష్ణ మురళీలతో కూడిన  ధర్మాసనం శనివారం తీర్పును వెలువరించింది. గతంలో ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. తాజాగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేసింది. నిరసన తెలిపే హక్కు అనేది ఎప్పుడూ ఉంటుందనుకోవడం, ఎల్లప్పుడూ ఉంటుందని భావించడం సరైంది కాదని సుప్రీంకోర్టు ( Supreme court )స్పష్టం చేసింది.

Also read: Gmat Exam: ప్రపం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

చ ప్రసిద్ధ జీ మ్యాట్ పరీక్షా విధానంలో వచ్చిన మార్పులేంటో తెలుసా..

Trending News