నిరవ్ మోదీకి షాక్ ఇచ్చిన స్విస్ అధికారులు!

స్విస్ అధికారులు నిరవ్ మోదీకి, అతడి సోదరి పుర్వి మోదీకి అనుకోని షాక్ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లో ఈ ఇద్దరికీ వున్న నాలుగు బ్యాంక్ ఎకౌంట్స్‌ని స్విస్ అధికారులు స్తంభింపజేశారు. 

Last Updated : Jun 27, 2019, 01:38 PM IST
నిరవ్ మోదీకి షాక్ ఇచ్చిన స్విస్ అధికారులు!

న్యూఢిల్లీ: స్విస్ అధికారులు నిరవ్ మోదీకి, అతడి సోదరి పుర్వి మోదీకి అనుకోని షాక్ ఇచ్చారు. స్విట్జర్లాండ్‌లో ఈ ఇద్దరికీ వున్న నాలుగు బ్యాంక్ ఎకౌంట్స్‌ని స్విస్ అధికారులు స్తంభింపజేశారు. నాలుగు బ్యాంక్ ఎకౌంట్స్‌లో కలిపి సుమారు రూ.283.16 మొత్తం వున్నట్టు తెలుస్తోంది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ చట్టం కింద ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ చేసిన విజ్ఞప్తి మేరకు స్విస్ అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. భారత్‌లో బ్యాంకులను మోసం చేసి అక్రమ మార్గంలో సంపాదించిన సొమ్మునే అక్కడి బ్యాంకుల్లో జమ చేసినట్టుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు స్విస్ అధికారుల దృష్టికి తీసుకొచ్చిన నేపథ్యంలోనే నిరవ్ మోదీ, పుర్వి మోదీలకు ఈ ఎదురుదెబ్బ తగిలినట్టు సమాచారం.

భారత్‌లో పంజాబ్ నేషనల్ బ్యాంకును రూ.13,500 కోట్ల మేర మోసం చేసిన కేసులో నిరవ్ మోదీ ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణం వెలుగుచూసిన అనంతరం లండన్‌కి పారిపోయిన నిరవ్ మోదీ అప్పటి నుంచి అక్కడే తలదాచుకుంటున్నాడు. లండన్‌లో నివాసం ఉంటున్న నిరవ్ మోదీని తమకు అప్పగించాల్సిందిగా కోరుతూ భారత సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రస్తుతం అక్కడి వెస్ట్ మిన్‌స్ట్రర్ కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులోనే మార్చి నెలలో అరెస్ట్ అయిన నిరవ్ మోదీ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైల్లో ఖైదీగా ఉన్నాడు. బెయిల్ కోసం నిరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్లను అక్కడి కోర్టు కొట్టివేసింది. దీంతో ప్రస్తుతం జైలు ఖైదీగా కాలం గడుపుతున్నాడు.

Trending News