tata group stocks down fall amid ratan tata in hospitalized: ప్రముఖ వ్యాపార దిగ్గజం రతన్ టాటా ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారని వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా వైరల్ గా మారాయి. ఆయన ఆరోగ్యం సీరియస్ గా ఉందని ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించి మరీ ట్రీట్మెంట్ ఇస్తున్నారని కూడా వైద్యులు వార్తలు వెలువడ్డాయి. దీంతో ఒక్కసారిగా రతన్ టాటా హెల్త్ పట్ల దేశమంతా కూడా ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా.. ఆయన మరల ఎక్స్ వేదికగా తాను ఆరోగ్యంగానే ఉన్నానని, తన హెల్త్ పట్ల వచ్చిన రూమర్స్ లను నమ్మోద్దని కూడా ఎక్స్ వేదికగా క్లారిటీ ఇచ్చారు. అప్పటి వరకు కూడా చాలా మంది ఏదో జరిగిపోయిందని కూడా ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. రతన్ టాటా రూమర్స్ నేపథ్యంలో.. టాటా గ్రూప్ కు చెందిన స్టాక్స్ లు ఒక్కసారిగా పడిపోయినట్లు కూడా తెలుస్తోంది.
పూర్తి వివరాలు..
కొంత మంది చేసిన ఫెక్ ప్రచారానికి ఏకంగా దిగ్గజ సంస్థకు చెందిన స్టాక్స్ లు ఢమాల్ అని కిందకు పడిపోయాయి. ముఖ్యంగా.. టాటా మోటార్స్, టాటా స్టీల్, టాటా కెమికల్స్, ఇండియన్ హోటల్స్, నెల్కో, టాటా కన్స్యూమర్ , టైటాన్‌తో సహా అనేక ప్రధాన టాటా కంపెనీలు తమ స్టాక్ లలో భారీగా క్షీణతను చూసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా.. టాటా మోటార్స్ షేరు ప్రస్తుతం.. రూ.929.95 వద్ద ట్రేడవుతున్నట్లు తెలుస్తోంది.
అదే విధంగా.. టాటా కాఫీ, టాటా మెటాలిక్స్, టాటా స్టీల్ లాంగ్ ప్రొడక్ట్స్ మరియు టీసీఎస్ వంటి కొన్ని టాటా సంస్థలు మాత్రం ఈ పుకార్లకు భిన్నంగా లాభాలను నమోదు చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో, తేజస్ నెట్‌వర్క్స్, ఆర్ట్‌సన్ ఇంజినీరింగ్ వరుసగా 5.1 శాతం, 5 శాతం పడిపోయాయి. గత సంవత్సరంలో, టాటా స్టాక్ 50 శాతం లాభపడినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మాత్రం 17 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉండగా.. రతన్ టాటా 1937 డిసెంబరు 28న ముంబైలో జన్మించారు. ఆయన టాటా గ్రూప్ వ్యవస్థాపకుడు జామ్‌సెట్‌జీ టాటా మునిమనవడు. 1990 నుంచి 2012 వరకు గ్రూప్ ఛైర్మన్‌గా, అక్టోబర్ 2016 నుంచి ఫిబ్రవరి 2017 వరకు తాత్కాలిక ఛైర్మన్‌గా ఉన్నారు. ప్రస్తుతం.. టాటా గ్రూపు ఛారిటబుల్ ట్రస్టులకు రతన్ టాటా అధిపతిగా కొనసాగుతున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.