షాకింగ్: తెలంగాణలో 4,700 మంది పిల్లలు అదృశ్యం

తెలంగాణ రాష్ట్రంలో 4,700 మంది పిల్లలు అదృశ్యమైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, 2016లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,700 మంది పిల్లలు తప్పిపోయారు.

Last Updated : Dec 4, 2017, 04:14 PM IST
    • తెలంగాణ లో 4,700 మంది మైనర్లు మిస్సింగ్
    • ఆగంతకుల అపహరణ; ఇంటి నుండి పారిపోవడం ప్రధాన కారణాలు
    • 1021 మందిని గుర్తించినా.. మిగితావారి ఆచూకీ లభ్యం కావటం లేదు
షాకింగ్: తెలంగాణలో 4,700 మంది పిల్లలు అదృశ్యం

తెలంగాణ రాష్ట్రంలో 4,700 మంది పిల్లలు అదృశ్యమైనట్లు జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో తెలిపింది. తాజాగా విడుదలైన గణాంకాల ప్రకారం, 2016లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 4,700 మంది పిల్లలు తప్పిపోయారు. పిల్లలు ఇలా తప్పిపోవడానికి ప్రధాన కారణం ఆగంతకులు పిల్లలను ఎత్తుకుపోవడం, పిల్లలు ఇంటి నుండి పారిపోవడం అని పోలీసు అధికారులు చెబుతున్నారు. 

తప్పిపోయిన 4,700 మంది పిల్లలలో పోలీసులు ఇప్పటివరకు కేవలం 1021 మంది పిల్లలను గుర్తించారు. వారిలో 377 మంది బాలురు, 644 మంది బాలికలు ఉన్నారు. ఇలానే ఏపీ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా పిల్లలు తప్పిపోయారని తెలిపింది. ఏపీలో 3,324, తమిళనాడులో 5,801 మంది పిల్లలు తప్పిపోయినట్లు కేసులు నమోదు అయ్యాయని గణాంకాలను వెల్లడించింది. మధ్య ప్రదేశ్ లో అధికంగా 12,068 మంది పిల్లలు (3,446 బాలురు మరియు  8,622 బాలికలు) తప్పిపోయారని ఆందోళన వ్యక్తం చేసింది జాతీయ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. తప్పిపోయిన పిల్లలలో కొంత మందిని వెతికి పట్టుకున్నా.. పోలీసులకు మిగితా వారి ఆచూకీ లభించకపోవడంతో తల్లితండ్రులు ఆందోళనలకు గురౌతున్నారు.

Trending News