Terrorists plan: ప్రధాని మోదీ పర్యటన భగ్నానికి ఉగ్రవాదుల కుట్ర

Terrorists plan : ప్రధాని మోదీ పర్యటనలో భారీ విధ్వంసానికి కుట్ర జరిగిందా ? ఇందుకోసం అఫ్గానిస్థాన్‌ నుంచి ఉగ్రవాదులు సరిహద్దులు దాటారా ? ఈ ప్రశ్నలకు భద్రతా వర్గాల నుంచి అవుననే సమాధానం వస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 24, 2022, 07:10 PM IST
  • ప్రధాని మోదీ జమ్మూకశ్మీర్ పర్యటన భగ్నానికి కుట్ర
  • ఇద్దరు ఉగ్రవాదుల ఎన్‌కౌంటర్
  • ఉగ్ర కుట్ర భగ్నం చేసిన భద్రతా దళాలు
Terrorists plan: ప్రధాని మోదీ పర్యటన భగ్నానికి ఉగ్రవాదుల కుట్ర

Terrorists plan : ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూకశ్మీర్ పర్యటనను భగ్నం చేసేందుకు అఫ్గానిస్థాన్ నుంచి ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులను జైషే మహ్మద్ సంస్థ రంగంలోకి దించినట్లు భద్రతా దళాలు అనుమానిస్తున్నాయి. సుంజ్వాన్‌లోకి ఆ ఇద్దరు ఆత్మాహతి దళ సభ్యులు చొరబడ్డారు. ఈ విషయాన్ని జమ్మూకశ్మీర్ అడిషనల్ డీజీపీ ముఖేష్ సింగ్ వెల్లడించారు. 

జమ్మూకాశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తి హోదానిచ్చే ఆర్టికల్‌ 370 ఉపసంహరణ తరువాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారి జమ్మూకశ్మీర్‌లో పర్యటించారు. మోదీ పర్యటనకు రెండ్రోజుల ముందు అంటే ఏప్రిల్ 22న జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఆ ఇద్దరు ఆత్మాహుతి దళ సభ్యులను భద్రతా దళాలు మట్టుపెట్టాయి. స్థానికుల నుంచి ఉగ్రవాదులకు సహకారం అందినట్లు గుర్తించారు. వీరికి సహకరించిన ఇద్దరిని అరెస్టు చేశారు. ప్రధాని పర్యటనలో వీలైనంత ఎక్కువ మంది భద్రతా సిబ్బంది హతమర్చడమే లక్ష్యంగా ఆఫ్గాన్‌ నుంచి ఉగ్రవాదులు భారత్ వచ్చినట్లు తెలుస్తోంది. భద్రతాదళాలు అరెస్టు చేసిన ఇద్దరికి ఒకరైన షఫీక్ ఫోన్‌ ను ఆత్మాహుతి దళ సభ్యులు వినియోగించినట్లు సమాచారం. పాక్‌లో ఉన్న కమాండర్‌తో ఆ ఫోన్‌తోనే వారు మాట్లాడారు. మోదీ పర్యటనకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై ఆరా తీయాలని షఫీక్‌కు వారు చెప్పినట్లు సమాచారం.

సాంబలో షఫిక్ ఏర్పాటు చేసిన కాయగూరల ట్రక్కు ఎక్కి సుంజ్వాన్ చేరుకున్నట్లు భద్రతా దళాలు వెల్లడించాయి. వీరు పాకిస్థాన్- అఫ్గాన్ సరిహద్దుల్లోని ఖైబర్ పక్తూన్‌ఖ్వా లేదా ఆఫ్గానిస్తాన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో పర్యటించిన ప్రధాని నరేంద్ర మోదీ (modi) 20 వేల కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. 3100 కోట్లతో నిర్మించిన బనిహాల్-కాజీగుండ్ సొరంగ రహదారిని ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో పాటు ఢిల్లీ-అమృత్‌సర్-కాట్రా ఎక్స్‌ప్రెస్‌ రహదారికి శంకుస్థాపన చేశారు. దీన్ని 7500 కోట్లతో నిర్మించనున్నారు. చీనాబ్‌ నదిపై నిర్మించతలపెట్టిన రెండు జలవిద్యుత్ ప్రాజెక్టులకు సైతం మోదీ శంకుస్థాపన చేశారు. అమృత్ సరోవర్ మిషన్‌ను ప్రధాని ప్రారంభించారు.

ALSO READ: Sri Lanka economic crisis: శ్రీలంకకు భారత్ ఆపన్నహస్తం.. మరో 500 మి.డాలర్ల సాయం!

ALSO READ: Indonesia Ban on Palm oil exports: పామాయిల్‌ ఎగుమతులపై ఇండోనేషియా నిషేధం..మరోసారి పెరగనున్న పామాయిల్‌ ధరలు..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News