నిండు గర్భిణిని కడుపులో తన్నిన సీపీఎం నేత.. కేరళలో దారుణం

కేరళలో రెండు వారాల క్రితం ఓ దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఓ 30 సంవత్సరాల మహిళను సీపీఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు కడుపులో తన్నిన ఘటన వెలుగు చూసింది.

Last Updated : Feb 15, 2018, 09:15 PM IST
నిండు గర్భిణిని కడుపులో తన్నిన సీపీఎం నేత.. కేరళలో దారుణం

కేరళలో రెండు వారాల క్రితం ఓ దారుణం చోటు చేసుకుంది. నిండు గర్భిణి అని కూడా చూడకుండా ఓ 30 సంవత్సరాల మహిళను సీపీఎం పార్టీకి చెందిన ఓ నాయకుడు కడుపులో తన్నిన ఘటన వెలుగు చూసింది. ఈ ఘటనలో బాధితురాలికి తీవ్ర రక్తస్రావమై తన బిడ్డను కోల్పోవడం గమనార్హం. ఈ సంఘటనకు సంబంధించి బాధితులు స్థానిక పోలీస్ స్టేషనులో కేసు కూడా నమోదు చేశారు. అయితే పార్టీ కార్యకర్తలు, నేతల నుండి తమకు బెదిరింపులు వస్తున్నాయని.. కేసు విత్ డ్రా చేసుకోమని వారు కోరుతున్నారని వాపోతున్నారు బాధితులు. 

ఈ విషయంపై బాధితురాలు భర్త షిబు మాట్లాడుతూ "ఒక్క చిన్న మాట తగదా వల్ల జరిగిన గొడవలో మా ఇంటి పక్కనే ఉండే వ్యక్తితో వాగ్వాదం జరిగింది. అతను ఓ సీపీఎం నాయకుడు. ఈ గొడవలో నాకు మద్దతుగా వచ్చిన నా భార్యను ఆయనతో పాటు తన కార్యకర్తలు విచక్షణారహితంగా కొట్టారు. అతను నిండు గర్భిణైన నా భార్యను బలంగా కడుపులో తన్నడం వల్ల తను అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. గాయం బాగా తగలడంతో ఆమె కడుపులోని బిడ్డ చనిపోయిందని డాక్టర్లు చెప్పారు" అని తెలిపారు. 

ఈ విషయంపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశామని, కోడెంజరీ, తమరసెరీ స్టేషన్లలో కేసులు కూడా నమోదు చేశామని అన్నారాయన. ఇదే కేసు విషయమై పోలీసులు స్పందిస్తూ ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏడుగురు వ్యక్తులను అరెస్టు చేశామని తెలిపారు. అయితే ఈ ఘటనకు కారణమైన సీపీఎం నేత మాత్రం ఇంకా బయటే తిరుగుతున్నారని... తనపై ఎలాంటి కేసులు కూడా నమోదు చేయలేదని వాపోతున్నారు బాధితులు

Trending News