Gujarat: దేశంలో నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లక్షలాది కేసులు కోర్టుల్లో పెండింగులో ఉంటున్నాయి. మరోవైపు లెక్కకు మించిన కేసులు విచారణలో ఉన్నాయి. దీంతో కేసులను సత్వరం పరిష్కరించడానికి టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు పోలీసులు. అంతేకాకుండా క్రిమినల్ కేసుల(Criminal Cases) విచారణకు పోలీసులు డాగ్ స్క్వాడ్స్ ను కూడా ఉపయోగిస్తుంటారు. శిక్షణ పొందిన శునకాలు(dogs) వాసన ఆధారంగానే హంతకుల(culprits)ను కనిపెడతాయి. నేర పరిశోధన(investigation)లో ప్రముఖ పాత్ర పోషిస్తుంటాయి.
తాజాగా గుజరాత్(Gujarat)లో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. వడోదర(Vadodara) పోలీస్ డాగ్ స్క్వాడ్‌లోని శునకం (dog) కేవలం 20 నిమిషాల్లోనే ఆరుగురు రేపిస్టులను పోలీసులకు పట్టించింది. వడోదరలో 30 ఏళ్ల మహిళపై అత్యాచారానికి పాల్పడ్డ దుండగులు ఆ తర్వాత ఆమెను హత్య చేశారు. ఈ కేసును పోలీసులు(police) ఛాలెంజ్ గా తీసుకున్నారు. దీనికోసం విచారణలో స్నిఫర్ డాగ్ 'జావా'(Java) సాయం తీసుకున్నారు.
Also Read: Corona Third Wave: అక్టోబర్ నెలలో దేశంలో కరోనా థర్డ్‌వేవ్, భయపెడుతున్న ఆ నివేదిక
ఈ మేరకు ఒక బాటిల్‌తో పాటు దుపట్టాను పసిగట్టిన మన సూపర్ డాగ్(super dog).. నిందితులు పారిపోయిన దిశగా పోలీసులను నడిపించింది. అహ్మదాబాద్-ముంబై రైల్వే ట్రాక్ దాటి దాదాపు రెండు కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి, అక్కడున్న ఓ టెంట్ దగ్గర ఆగిపోయింది. మొరగడం ప్రారంభించింది. దీంతో పోలీసులు రేపిస్టుల(rapists)ను పట్టుకోగలిగారు. 45 రోజుల వ్యవధిలో పలు హత్య కేసుల్లో నిందితులను గుర్తించేందుకు సూపర్ డాగ్(Super Dog) పోలీసులకు సాయపడటం ఇది మూడోసారి.
ఆగస్టు 16న కర్ణన్(Karnan) తాలూకా పరిధిలోని దేహాన్ గ్రామ సమీపంలో గడ్డికోస్తున్న మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు. ఈ ఘటనలో కర్ణాన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు అయింది. స్నిఫర్ డాగ్ జావాతో క్రైమ్ స్పాట్‌కు చేరుకున్న పోలీసులు.. డాగ్ సాయంతో ముందుగా నిందితుల్లో ఒకరైన యూపీ(UP)కి చెందిన 22 ఏళ్ల లాల్ బహదూర్ గిర్దారాంను అరెస్టు చేశారు. ఆ తర్వాత మిగతా వారిని పట్టుకున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook