Budget 2019 : ఆర్ధిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే ..

లోక్ సభలో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2019 లో అభివృద్ధి అంశాలతో పాటు సామాన్యులకు ఆకట్టుకనేలా సంక్షేమ కార్యక్రమాలను పొందు పరిచారు ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్  

Last Updated : Jul 5, 2019, 03:12 PM IST
Budget 2019 : ఆర్ధిక మంత్రి ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఇవే ..

దేశ ప్రజలు గతం కంటే భారీ మెజార్టీ ఇచ్చి మోడీ టీం కు రెండో సారి అధికారం కట్టబెట్టారు. దీంతో సహజంగానే  ఈ సారీ మోడీ సర్కార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జనాల అంచనాలకు అనుగుణంగాబడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు ఆర్ధికమంత్రి నిర్మాల సీతారామన్. ఈ క్రమంలో అభివృద్ధి అంశాలతో పాటు సామాన్యులకు ఆకట్టుకనేలా సంక్షేమ కార్యక్రమాలను పొందుపరిచి ఈ రోజు  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌  లోక్‌సభలో బడ్జెట్‌-2019ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి  బడ్జెట్ 2019 లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం..

* పన్నుల విధానంలో మరింత పారదర్శకత 
* వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు
* రూ. 5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఐదు  కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
*  కార్పొరేట్‌ ట్యాక్స్‌ పరిధి రూ.400 కోట్లకు పెంపు

* స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు
* ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం
* అందరికీ ఇళ్ల కల్పించే లక్ష్యంతో 1.9 కోట్ల నివాసాల నిర్మాణం 
*  ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం. 
* జల్‌శక్తి అభియాన్‌ పథకం ద్వారా 256 జిల్లాల్లో సాగుకు నీరు

* ప్రధానమంత్రి డిజిటల్‌ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ 
* అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం 
* డీజిల్‌, పెట్రోల్‌పై ఎక్సైజ్‌ సుంకం రూ.1 పెంపు
* బంగారంపై కస్టమ్స్‌ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంపు
* దేశంలో నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు

*  దేశంలో 1.25 లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునికీకరణ
* విద్యుత్‌ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే యోచన
* దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్‌ జోన్ల ఏర్పాటు
* బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
*  సోషల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ చేయూతకు ఎలక్ట్రానిక్‌ విధానంలో నిధుల సేకరణ

*  ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ. 
*  ఎల్‌ఈడీ వాడకంతో రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్‌ ఆదా
*  భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు
*  భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
*బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం. 

* ఖేల్‌ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం. 
* స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్‌ ఏర్పాటు
* పట్టణీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు
*  స్టాండప్‌ ఇండియా పథకంతో  వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ
* రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేల ముద్రణ
*  4లక్షల కోట్ల మొండి బకాయిల వసూళ్ల కోసం కఠిన చట్టాలు

*   సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ 
*  ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణ
* మహిళల అభివృద్ధికి  ప్రత్యేక పథకాలు
*  జన్‌ధన్‌ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్‌ డ్రాఫ్ట్‌ సౌకర్యం
* ఆన్‌లైన్‌ పర్సనల్‌ లోన్స్‌, మీ ఇంటి ముందుకే బ్యాంకు సేవలు

*  దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు
* దేశంలోని  17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు
*  ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్‌ 
*  జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం
*   పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.

* మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
*  నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం
* ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ
* ‘హర్‌ ఘర్‌ జల్‌’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
* జీరో బడ్జెట్‌ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం) 

* 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్‌, గ్యాస్‌ సరఫరా
* ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
* మీడియా, యానిమేషన్‌, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన.
* సామాన్యులకు అందుబాటులోకి ఉండేలా ఆదర్శ అద్దె విధానం
*ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం

* పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గించేందుకు చర్యలు
* బస్‌ ఛార్జీలు, పార్కింగ్‌ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన
* మినిమమ్‌ గవర్నమెంట్‌, మ్యాగ్జిమమ్‌ గవర్నన్స్‌  విధానం
*  పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం 
*  కర్మయోగి మాన్‌ధన్‌ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్‌ పథకం

* ఎలక్ట్రిక్‌ వాహనాల సబ్సిడీ కోసం ప్రత్యేక లాబీయింగ్‌
*  ఎఫ్‌డీఐల ఆకర్షణించేందుకు  మరింత పారదర్శకమైన ఆర్ధిక వ్యవస్థ
* విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సరికొత్త కొత్త విధానం, రెడ్‌ టేపిజం నియంత్రణకు చర్యలు
* ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు
* ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు
* అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు

 

Trending News