జిన్నా ప్రధాని అయ్యుంటే, దేశం విడిపోయేది కాదు: బీజేపి లోక్ సభ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

కాంగ్రెస్ పార్టీ వల్లే దేశం విడిపోయిందని సంచలన వ్యాఖ్యలు చేసిన బీజేపి లోక్ సభ అభ్యర్థి

Last Updated : May 12, 2019, 05:31 PM IST
జిన్నా ప్రధాని అయ్యుంటే, దేశం విడిపోయేది కాదు: బీజేపి లోక్ సభ అభ్యర్థి సంచలన వ్యాఖ్యలు

రాట్లం: ముహమ్మద్ అలీ జిన్నా భారత దేశం తొలి ప్రధాని అయ్యుంటే, దేశం విడిపోయేది కాదని బీజేపి లోక్ సభ అభ్యర్థి గుమన్ సింగ్ దామర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ విభజన సమయంలో జవహార్ లాల్ నెహ్రూ కనుక పదవి కోసం పట్టుబట్టకుండా ఉండి, అడ్వకేట్, తెలివిగలవాడైన మహ్మద్ అలీ జిన్నాను ప్రధానిని చేసి వుంటే అసలు దేశమే రెండు ముక్కలుగా విడిపోయి ఉండేది కాదని వ్యాఖ్యానించి మరో సరికొత్త వివాదానికి తెరతీశారు గుమన్ సింగ్. మధ్యప్రదేశ్‌లోని రాట్లం-ఝబువా లోక్ సభ స్థానం నుంచి బీజేపి అభ్యర్థిగా బరిలో నిలిచిన గుమన్ సింగ్ శనివారం జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీనే కారణం అని గుమన్ సింగ్ ఆరోపించారు.

బీజేపి లోక్ సభ అభ్యర్థి గుమన్ సింగ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పటికే దేశవ్యాప్తంగా చర్చనియాంశం కాగా.. బీజేపి ఎంపీ అభ్యర్థి చేసిన ఈ ఆరోపణలపై కాంగ్రెస్ పార్టీ ఏమని స్పందిస్తుందో వేచిచూడాల్సిందే మరి.

Trending News