అతి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

Gold Rate Today: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో లాక్‌డౌన్ ప్రకటించాక శనివారం తొలిసారి బంగారం ధరలు తగ్గాయి. సోమవారం మార్కెట్‌లో స్వల్పంగా ధర పెరిగింది.

Updated: Mar 31, 2020, 08:39 AM IST
అతి స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

హైదరాబాద్: బులియన్ మార్కెట్‌లో సోమవారం బంగారం ధరలు (Gold Rate Today) అతి స్వల్పంగా పెరిగాయి. గత కొన్నిరోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు శనివారం మార్కెట్‌లో భారీగా పతనమైన విషయం తెలిసిందే. మార్చి 30న బంగారం ధరలలో అంతగా మార్పులేదు. జ్యువెలర్ల విక్రయాలు తగ్గడం, లాక్‌డౌన్ కారణంగా దేశీయ మార్కెట్‌లో డిమాండ్ లేని పరిస్థితుల్లో నేటి బులియన్ మార్కెట్ ప్రారంభమైంది. వెండి ధరలు సైతం అతి స్వల్పంగా పెరిగాయి. శుభవార్త.. కరోనా మహమ్మారికి చైనా వ్యాక్సిన్ రెడీ!

24 carat Gold Silver price in Andhra Pradesh

హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం మార్కెట్లలో మార్చి 30న  బంగారం 10 గ్రాముల ధర స్వల్పంగా రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.43,385కి చేరుకుంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం 10గ్రాముల ధర రూ.39,838 అయింది. బికినీలో బిగ్‌బాస్ రన్నరప్.. వామ్మో అంత హాట్‌గా!

దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు అతి స్వల్పంగా పెరిగాయి. బంగారం ధర కేవలం రూ.10 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,720కి చేరుకుంది. కాగా, 22 క్యారెట్ల బంగారం ధర సైతం అంతే పెరిగింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.41,420కి పెరిగింది. కడుపుబ్బా నవ్వించే Corona జోక్స్

కాగా, వెండి ధరలు సైతం బంగారాన్ని అనుసరించాయి.  బులియన్ మార్కెట్‌లో సోమవారం 1 కేజీ వెండి రూ.10మేర పెరిగింది. దీంతో 1కేజీ వెండి ధర రూ.39,510 అయింది. న్యూఢిల్లీ, హైదరాబాద్‌, విజయవాడ, విశాఖపట్నంలోనూ ఒక కేజీ వెండి ధర ఇదే ధరలో ట్రేడ్ అవుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

బుల్లితెర భామ టాప్ Bikini Photos 

బికినీలో సెగలురేపుతోన్న Sunny Leone