మార్చి 31 అర్థరాత్రి నుండి టోల్ ఛార్జీలు పెంపు

జాతీయ రహదారుల్లో ఈ రోజు అర్థరాత్రి నుండి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది.

Last Updated : Mar 31, 2018, 05:01 PM IST
మార్చి 31 అర్థరాత్రి నుండి టోల్ ఛార్జీలు పెంపు

జాతీయ రహదారుల్లో ఈ రోజు అర్థరాత్రి నుండి టోల్ ఛార్జీలు పెరగనున్నాయి. ఈ మేరకు నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న 5 శాతాన్ని 7 శాతంగా మార్చనున్నట్లు తెలిపింది. అన్ని రకాల వాహనాలపై కూడా ఈ ఛార్జీలు పెరగనున్నాయి. అయితే ఈ టోల్ ఛార్జీలు పెరగడం వల్ల వాహనాలకే కాక, వస్తు రవాణా వ్యవస్థకు కూడా నడ్డి విరిగే అవకాశం ఉందని.. ఈ క్రమంలో నిత్యవసర సరకుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని పలువురు ఆర్థిక నిపుణులు అంటున్నారు.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా 372 టోల్ ప్లాజాలు ఉన్నాయి. వీటి ధరలు ఆర్థిక సంవత్సరం ప్రారంభమవ్వడానికి ముందే నిర్ణయించడం జరుగుతుంది. అయితే ప్రాంతాలను బట్టి కూడా ఈ ధరలు మారే అవకాశం ఉంటుంది. అయితే నేషనల్ హైవేల విషయానికి వస్తే.. ఇప్పటికే టోల్ ఛార్జీలు అధికంగా వసూలు చేస్తున్నారని.. ఈ క్రమంలో మళ్లీ రేట్లు పెంచడమంటే ట్రాన్సపోర్టర్ల నడ్డి విరవడమే అని పలువురు వాపోతున్నారు.

ఇప్పటికే ఇ-వే బిల్లులు పెంచడమే కాకుండా.. పెట్రోల్, డీజిల్ ధరలు కూడా ప్రభుత్వం పెంచిందని.. ఈ క్రమంలో టోల్ ఛార్జీలు కూడా పెంచితే.. రవాణా వ్యవస్థలో పనిచేసేవారి ఖర్చులు పెరుగుతాయని అంటున్నారు.

Trending News