Trainee army officer rabberd incident in Madhya Pradesh: మహిళలు, అమ్మాయిలపై దాడులు, అత్యాచారాల ఘటనలు ప్రతిరోజు కామన్ గా మారాయి. ఇప్పటికే కోల్ కతా జూనియర్ డాక్టర్ అత్యాచార ఘటన దేశంలో పెనుదుమారంగా మారింది. అయిన కూడా మహిళలపై మాత్రం అత్యాచారాలు ఆగడంలేదు. ఏకంగా దేశ ప్రధాని, రాష్ట్రపతి ద్రౌపదీముర్ములు సైతం.. దీనిపై ఆందోళనలు వ్యక్తం చేశారు.
దీనిపై కఠిన చట్టాలు, ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసి కఠినంగా చర్యలు తీసుకొవాలని డిమాండ్ లు వెల్లువెత్తున్నాయి. అయిన కూడా మహిళలపై దాడుల ఘటనలు మాత్రం ఆందోళన కల్గించే అంశాలుగా మారాయి. తాజాగా, మరో ఘటన మధ్య ప్రదేశ్ లో చోటు చేసుకుంది.
పూర్తి వివరాలు..
మధ్య ప్రదేశ్ లోని ఇండోర్ లో.. కొంత మంది ట్రైనీ ఆర్మీ అధికారులు, తమ స్నేహితురాళ్లతో కలిసి పిక్నిక్ లకు వెళ్లారు. అక్కడే సరదగా గడుపుతున్నారు. ఇంతలో అక్కడికి కొంత మంది దుండగులు చేరుకున్నారు. కత్తులు, గన్ లతో బెదిరింపులకు దిగారు. అంతేకాకుండా.. ట్రైనీ అధికారుల దగ్గర ఉన్న.. డబ్బులు, బంగారంలను దోచుకుని వెళ్లారు.
అంతేకాకుండా.. ట్రైనీ అధికారి స్నేహితురాలిపై దాడిచేశారు. ఆమెను పొదల్లోకి తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. వీరిలో ఒక ఆర్మీ అధికారి తప్పించుకుని వెళ్లి, ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చాడు. దీంతో హుటాహుటీన ఘటనకు చేరుకున్నారు. పోలీసుల్ని చూడగానే.. దుండగులు అక్కడి నుంచి పారిపోయారు.
Read more: Snake news: చేపను చూసి టెంప్ట్ అయిన పాము.. చూస్తుండగానే ఊహించని బిగ్ ట్విస్ట్.. ఎక్కడో తెలుసా..?
మరోవైపు.. పోలీసులు యువతిని దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు కూడా బైటపడింది. ఈ నేపథ్యంలో.. ఆర్మీ అధికారిణులపై అత్యాచార ఘటన ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. మరోవైపు దాడి చేసిన వారిలో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో ఒకరికి నేర చరిత్ర ఉన్నట్లు కూడా బైటపడింది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.