త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ ఓ మోసం: అసదుద్దీన్ ఓవైసీ

త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ ఓ మోసం: అసదుద్దీన్ ఓవైసీ  

Last Updated : Sep 27, 2018, 04:33 PM IST
త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ ఓ మోసం: అసదుద్దీన్ ఓవైసీ

ఇటీవల కేంద్ర కేబినెట్ ఆమోదించిన త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ ఓ పెద్ద మోసం అని ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. కేంద్రం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్‌ని కోర్టులో సవాల్ చేయాల్సిన అవసరం ఉందని అసదుద్దీన్ అభిప్రాయపడ్డారు. త్రిపుల్ తలాక్ ఆర్డినెన్స్ గురించి తాజాగా అసదుద్దీన్ ఓవైసీ స్పందిస్తూ.. త్రిపుల్ తలాక్‌ని రాజ్యాంగ విరుద్ధమైనదిగా సుప్రీం కోర్టు తేల్చిచెప్పినట్టు ఆర్డినెన్స్ మొదటి పేజీలో పేర్కొన్నారని, కానీ వాస్తవానికి త్రిపుల్ తలాక్ గురించి సుప్రీం కోర్టు ఎప్పుడూ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని అన్నారు. 

దేశ అత్యున్నత న్యాయస్థానం ఈ త్రిపుల్ తలాక్ అంశాన్ని కేవలం పక్కనపెట్టిందే కానీ అలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు ఎప్పుడూ చేయలేదు. అయితే, సుప్రీం కోర్టు చేయని వ్యాఖ్యలను సైతం చేసినట్టుగా ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు కనుకే ఈ ఆర్డినెన్స్ ఓ మోసపూరితమైన కుట్ర అవుతుందని అసదుద్దీన్ అభిప్రాయపడినట్టుగా తాజాగా ఏఎన్ఐ వెల్లడించింది.

Trending News