లేడీ డాక్టర్‌పై అత్యాచారం... మరో లేడీ డాక్టర్‌కు లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రభుత్వ వైద్యుల అరెస్ట్

Doctors held for rape: ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు పురుష వైద్యులు తోటి మహిళా వైద్యుల పట్ల నీచంగా ప్రవర్తించారు. ఇద్దరిలో ఒకరు ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడగా... మరొకరు మరో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 19, 2021, 02:47 PM IST
  • చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలిపై తోటి వైద్యుడి అత్యాచారం
    కోవిడ్ విధుల్లో ఉన్న సమయంలోనే అఘాయిత్యం
    మరో వైద్యురాలిపై లైంగిక వేధింపులు
    ఇద్దరు వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
 లేడీ డాక్టర్‌పై అత్యాచారం... మరో లేడీ డాక్టర్‌కు లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రభుత్వ వైద్యుల అరెస్ట్

Doctors held for rape: చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న ఇద్దరు వైద్యులను సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు వైద్యుల్లో ఒకరు ఓ మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి (Rape on woman doctor) పాల్పడగా... మరొకరు మరో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారన్న ఆరోపణలున్నాయి. ఈ ఇద్దరూ కోవిడ్ విధుల్లో ఉన్న సమయంలోనే ఈ అఘాయిత్యాలకు పాల్పడ్డారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... నిందితులు ఎస్ వెట్రిసెల్వన్ (35), ఎన్.మోహన్ రాజు (28) చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులుగా పనిచేస్తున్నారు. కోవిడ్ సమయంలో (Covid 19) వెట్రిసెల్వన్ మరికొందరు వైద్యులు, ఓ మహిళా వైద్యురాలు కలిసి ఒక టీమ్‌గా సేవలందించారు. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం... వీరంతా టీనగర్‌లోని ఓ ప్రైవేట్ హోటల్లో క్వారెంటైన్‌లో ఉండేవారు.

ఆ హోటల్లో ఉన్న సమయంలోనే వెట్రిసెల్వన్ తన సహచర వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అదే సమయంలో మోహన్ రాజు అనే వైద్యుడు మరో మహిళా వైద్యురాలిపై లైంగిక వేధింపులకు (Sexual harassment) పాల్పడ్డాడు. ఈ ఇద్దరిపై బాధిత మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారిపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు.

Also Read: వావ్: గూగుల్‌ పేలో కొత్త ఫీచర్.. వాయిస్ కమాండ్‌తో మనీ ట్రాన్స్ ఫర్

గురువారం (నవంబర్ 18) మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లోనూ ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. తనపై ఓ వ్యక్తి పలుమార్లు అత్యాచారానికి పాల్పడినట్లు 45 ఏళ్ల ఓ మహిళా వైద్యురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన ఆ వ్యక్తి... పెళ్లి పేరుతో తనకు దగ్గరయ్యాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆపై తనను నమ్మించి పలుమార్లు హోటల్‌కు తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని తెలిపింది. ఇటీవల పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి అతను మాట మార్చాడని... దీంతో తాను మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించినట్లు వెల్లడించింది. నిందితుడిపై పోలీసులు అత్యాచార కేసు (Rape case) నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News