Corona Second Wave: దేశంలో కరోనా శరవేగంగా విస్తరిస్తోంది. దేశవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ రాజకీయ ప్రముఖుల్లో కలకలం రేపుతోంది. ఇప్పుడు మరో కేంద్రమంత్రి కోవిడ్ 19 వైరస్ బారిన పడ్డారు.
కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave) ధాటికి దేశ ప్రజానీకం విలవిలలాడుతోంది. సామాన్యులు, వీఐపీలు అందరూ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలామంది రాజకీయ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. మరి కొందరు చికిత్స పొందుతున్నారు. కోవిడ్ 19 వైరస్ ( Covid19 virus) బారిన పడుతున్న రాజకీయ నేతల జాబితా నిత్యం పెరుగుతోంది. తాజాగా కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ ( Union minister Ramesh Pokhriyal) కరోనా వైరస్ బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్‌గా తేలిందని...వైద్యుల సూచన మేరకు చికిత్స తీసుకుంటున్నానన్నారు. ఇటీవలికాలంలో తనతో కాంటాక్ట్‌లో ఉన్న అందరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కరోనా పరీక్షలు(Covid Tests) చేయించుకుని కొద్దిరోజులు హోమ్ క్వారెంటైన్లో ఉండాలని రమేశ్ పోఖ్రియాల్ సూచించారు.
ఇప్పటికే దేశంలో పలు రాష్ట్ర ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కరోనా బారినపడ్డారు. దేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్( Manmohan singh), కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)లకు సైతం కరోనా పాజిటివ్‌గా తేలింది. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24 గంటల్లో అయితే అత్యధికంగా 2 లక్షల 95 వేల కొత్త కేసులు నమోదై ఆందోళన కల్గిస్తోంది.
Also read: Covaxin Efficacy: కరోనా కొత్త రకం స్ట్రెయిన్లపై సమర్ధవంతంగా పనిచేస్తున్న కోవ్యాగ్జిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook