Bamboo Plants: పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కాదు కదా నాలుగు రెట్లు సంపాదిస్తే ఎలా ఉంటుంది. అంతకుమించిన ఆనందమేముంటుంది. జూదమూ కాదు..షేర్ మార్కెట్ కాదు. మరెలా సాధ్యమైంది. అదే చూడండి.
షేర్ మార్కెట్ లేదా ఫైనాన్స్ రంగంలో పెట్టుబడులు కచ్చితంగా లాభాల్ని తెచ్చిపెడతాయి. ఒక్కసారి ఘోరంగా నష్టమూ ఎదురవుతుంది. ఆశించిన మేర లాభముండనే ఉండదు. అయితే పెట్టిన పెట్టుబడికి రెట్టింపు కాదు కదా..ఏకంగా నాలుగు రెట్లు సంపాదన లభిస్తే ఎలా ఉంటుంది. నమ్మలేకున్నారా. నిజమే. అదే జరిగింది.
ఉత్తరప్రదేశ్‌కు(Uttar pradesh) లఖీంపూర్ ఖేరీకు చెందిన సాకేతు గ్రామంలో 65 ఏళ్ల సురేశ్ చంద్ర బీఏ, ఎల్ఎల్బీ చదువుకున్నాడు. వ్యవసాయం మీద మక్కువ కొద్దరీ పూర్వీకుల ద్వారా సంక్రమించిన భూమిలో వివిధ రకాల పంటలు పండించాడు. చెరకు, వరి, గోధుమ వంటి పంటలు పండించాడు. మామిడి, ఉసిరి, లీచీ, నిమ్మ వంటి అంతర పంటలు కూడా పండించసాగాడు. ఇవి కాకుండా ఓ పంట ద్వారా పెట్టిన పెట్టుబడికి ఏకంగా నాలుగు రెట్లు సాధించాడు. నాలుగేళ్ల క్రితం పంత్ నగర్ వ్యవసాయ యూనివర్శిటీ నుంచి 234 వెదురు మొక్కల్ని 25 రూపాయల చొప్పున కొనుగోలు చేసి కేవలం ఎకరం భూమిలో నాటాడు. నాలుగేళ్ల కాలంలో ఒక్కో మొక్క 20 నుంచి 25 వెదురు బొంగుల్ని ఉత్పత్తి చేసింది. మూడేళ్లపాటు అంతరపంటగా చెరకు కూడా పండించాడు. నాలుగో యేట నుంచి మాత్రం కేవలం వెదురు మాత్రమే పండించాడు. ప్రతి మొక్క నుంచి 40-50 వరకూ వెదురు బొంగులొస్తాయి. ఒక్కొక్క వెదురు బొంగు ఊర్లలో 150 రూపాయలు పలుకుతుంది. ప్రతి మొక్కకు 50 వెదురు బొంగుల (Bamboo Plants)చొప్పున 234 మొక్కలకు 11 వేల 7 వందల వెదురు బొంగులు ఉత్పత్తి అవుతాయి. ఒక్కొక్క వెదురు బొంగును 150 రూపాయల చొప్పున అమ్మగా..17 లక్షల 55 వేల సంపాదన అందుతుంది. అదే జరిగింది. రేటు ఎక్కువైతే మరింత ధర పలకనుంది.
Also read: Bengaluru Building Collapse: కళ్లముందే కుప్పకూలిన మూడంతస్థుల భవనం, వీడియో వైరల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook