Police station : ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళ ముందే పోలీసు ఆఫీసర్ మస్టర్బేషన్

Uttar pradesh police: లక్నో: బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్.. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటూ ఫిర్యాదు చేయడానికని స్టేషన్‌కి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఎదుటే ఆమెను కించపరుస్తూ మస్టర్బేట్ చేశాడు. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు సందర్భాల్లో జరిగింది.

Last Updated : Jul 2, 2020, 03:22 PM IST
Police station : ఫిర్యాదు చేయడానికొచ్చిన మహిళ ముందే పోలీసు ఆఫీసర్ మస్టర్బేషన్

Uttar pradesh police: లక్నో: బాధ్యతాయుతమైన హోదాలో ఉన్న ఓ పోలీస్ ఆఫీసర్.. తనకు న్యాయం చేయాల్సిందిగా వేడుకుంటూ ఫిర్యాదు చేయడానికని స్టేషన్‌కి వచ్చిన ఓ మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. బాధితురాలి ఎదుటే ఆమెను కించపరుస్తూ మస్టర్బేట్ చేశాడు. అలా ఒకసారి కాదు.. రెండుసార్లు కాదు.. ఏకంగా మూడు సందర్భాల్లో జరిగింది. ఆ పోలీసు ఆఫీసర్ రెండు సందర్భాల్లో తనని అవమానించడం చూసి నిస్సహాయంగా వెనుదిరిగిన బాధితురాలు.. మూడోసారి చైతన్యంతో తిరగబడ్డారు. మూడోసారి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన బాధితురాలి పట్ల సదరు పోలీసు ఆఫీసర్ తీరులో మార్పు రాలేదు. కానీ ఈసారి బాధితురాలు ధైర్యాన్ని కూడదీసుకుని అతడి నిర్లక్ష్య వైఖరిని సీక్రెట్‌గా కెమెరాతో రికార్డు ( Cop caught masturbating ) చేశారు. ఆ విషయం తెలియని పోలీసు ఆఫీసర్.. ఆమె చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు. ఫిర్యాదు చేయడానికని స్టేషన్‌కి వచ్చిన మహిళను గౌరవించకపోగా.. ఆమెను అవమానపరుస్తూ ఆమె ఎదుటే మస్టర్బేట్ చేసుకున్న పోలీసు ఆఫీసర్ భీష్మ్ పాల్ సింగ్ ఉదంతం ఆధారాలతో సహా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఉత్తర్ ప్రదేశ్‌లోని దేవ్‌రియా జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మహిళను కించపర్చిన పోలీసు అధికారిపై తక్షణమే చర్య తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. 

మహిళను కంచపరిచిన వైనం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన అనంతరం సదరు పోలీసు అధికారి భీష్మ్ పాల్ సింగ్ అదృశ్యమయ్యాడు. బాధితురాలికి జరిగిన అన్యాయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు.. అతడిని సస్పెండ్ చేయడంతోపాటు అతడిపై పోలీసు కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. భీష్మ్ పాల్ సింగ్‌ ఆచూకీ చెప్పిన వారికి రూ. 25,000 నజరానా కూడా ప్రకటించారు.

Trending News