UPSC 2022 Results: ఆల్ ఇండియా పబ్లిక్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి యూపీఎస్సీ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షల తుది ఫలితాలు వెలువడ్డాయి. టాప్ 4 ర్యాంకులు అమ్మాయిలు హస్తగతం చేసుకోగా, తెలుగు విద్యార్ధులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. ఆ వివరాలు మీ కోసం..
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్షలు ఫైనల్ రిజల్ట్స్ వచ్చేశాయి. తెలుగు విద్యార్ధులు అత్యుత్తమ ప్రతిభ కనబర్చడమే కాకుండా మంచి ర్యాంకులు సాధించారు. ఓవరాల్‌గా దేశవ్యాప్తంగా మొదటి నాలుగు ర్యాంకుల్ని అమ్మాయిలే కైవసం చేసుకోవడం విశేషం. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్‌గా ఇషితా కిశోర్, రెండవ ర్యాంకర్‌గా గరిమా లోహియా, మూడవ ర్యాంకర్‌గా ఉమా హారతి, నాలుగవ ర్యాంకర్‌గా స్మృతి మిశ్రా నిలిచారు. దేశవ్యాప్తంగా మొత్తం 933 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా అందులో ఐఏఎస్ విభాగానికి 180 మంది, ఐఎఫ్ఎస్ విభాగానికి 38, ఐపీఎస్ విభాగానికి 200 మంది ఎంపికయ్యారు. రిజర్వేషన్ల ప్రకారమైతే జనరల్ కోటాలో 345, ఓబీసీలో 263, ఈడబ్ల్యూఎస్‌లో 99, ఎస్సీలో 154, ఎస్టీలో 72 మంది ఉన్నారు.
సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో తెలుగు విద్యార్ధులు సత్తా చాటారు. పెద్దఎత్తున ర్యాంకులు కైవసం చేసుకున్నారు. నారాయణపేటకు చెందిన ఉమా హారతి ఆల్ ఇండియా మూడవ ర్యాంకు సాధించారు. తెలుగు రాష్ట్రాల్లో టాప్ ర్యాంకర్ ఈమెనే. తిరుపతికి చెందిన పవన్ దత్తా 22వ ర్యాంకు సాధించారు. రాజమండ్రికి చెందిన తరుణ్ పట్నాయక్ 33వ ర్యాంకు సాధించారు. వరంగల్‌కు చెందిన అర్హిత్ 40వ ర్యాంకు పొందారు. తెలుగు విద్యార్ధులు దక్కించుకున్న ఇతర ర్యాంకులు ఇలా ఉన్నాయి..
హెచ్ఎస్ భావన 55వ ర్యాంకు
అరుణ్ మిశ్రా 56వ ర్యాంకు
సాయి ప్రణవ్ 60వ ర్యాంకు
నిధి పాయ్ 110వ ర్యాంకు
రుహాని 159వ ర్యాంకు
మహేశ్ కుమార్ 200వ ర్యాంకు
రావుల జయసింహారెడ్డి 217వ ర్యాంకు
అంకుర్ కుమార్ 257వ ర్యాంకు
బొల్లం ఉమామహేశ్వరి 270వ ర్యాంకు
చల్లా కళ్యాణి 285వ ర్యాంకు
పాల్వాయి విష్ణువర్ధన్ రెడ్డి 292వ ర్యాంకు
గ్రంథె సాయికృష్ణ 293వ ర్యాంకు
హర్షిత 315వ ర్యాంకు
వీరగంధం లక్ష్మీ సుజిత 311వ ర్యాంకు
ఎస్ చేతనారెడ్డి 346వ ర్యాంకు
శృతి యారగట్టి 362వ ర్యాంకు
సోనియా కటారియా 376వ ర్యాంకు
యప్పలపల్లి సుష్మిత 384వ ర్యాంకు
రేవయ్య 410వ ర్యాంకు
సీహెచ్ శ్రవణ్ కుమార్ రెడ్డి 426వ ర్యాంకు
కమల్ చౌదరి 656వ ర్యాంకు
రెడ్డి భార్గవ్ 772వ ర్యాంకు
నాగుల కృపాకర్ 866వ ర్యాంకు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook