సివిల్స్‌ టాపర్‌ అనుదీప్ మార్కులు 55.60 శాతం

యూపీఎస్సీ గతనెల ఏప్రిల్ 27న ప్రకటించిన సివిల్స్ ఫైనల్ ఫలితాలలో తెలంగాణకు చెందిన దూరిశెట్టి అనుదీప్‌ మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే!

Last Updated : May 7, 2018, 06:16 AM IST
సివిల్స్‌ టాపర్‌ అనుదీప్ మార్కులు 55.60 శాతం

న్యూఢిల్లీ:  యూపీఎస్సీ గతనెల ఏప్రిల్ 27న ప్రకటించిన సివిల్స్ ఫైనల్ ఫలితాలలో తెలంగాణకు చెందిన దూరిశెట్టి అనుదీప్‌ మొదటి ర్యాంకు సాధించిన విషయం తెలిసిందే! తాజాగా యుపీఎస్సీ సివిల్స్‌ ర్యాంకర్ల మార్కుల వివరాలను ఆదివారం విడుదల చేసింది. అందులో ఫస్టు ర్యాంకు అనుదీప్‌కు 55.60శాతం మార్కులు వచ్చాయి. మొత్తం 2025 మార్కులకు అనుదీప్‌ 1126 మార్కులు సాధించారు. అందులో 950 రాత పరీక్షలో వస్తే, 176 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి. సాధారణంగా  యూపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షకు 1750 మార్కులు, ఇంటర్వ్యూకు 275 మార్కులు ఉంటాయి. రెండో ర్యాంకర్‌ అను కుమారి 55.50 శాతం మార్కులు సాధించారు. ఆమె మొత్తం​1124 మార్కులు సాధించారు. మూడో ర్యాంకర్‌ సచిన్‌ గుప్తా 55.40 శాతం మార్కులు సాధించారు. ఇతరుల మార్కులు, శాతాల కోసం యూపీఎస్సీ వెబ్‌సైట్‌ upsconline.nic.inలో చూడవచ్చు.

నేడు సివిల్స్ టాపర్‌తో సీఎం కేసీఆర్ లంచ్  

సివిల్స్‌లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ను సీఎం కేసీఆర్ ప్రశంసించారు. ఆలిండియా టాపర్‌గా తెలంగాణ బిడ్డ నిలువడం రాష్ట్రానికే గర్వకారణమని పేర్కొన్నారు. అనుదీప్‌, అతని కుటుంబసభ్యలను సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం భోజనానికి రావాలని ఆహ్వానించారు.

 

Trending News