అయోధ్య కేసు తీర్పు: యూపీ సీఎస్, డీజీపీలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ భేటీ

అయోధ్య కేసు తీర్పు: యూపీలో పరిస్థితిపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ సమీక్ష  

Last Updated : Nov 8, 2019, 12:29 PM IST
అయోధ్య కేసు తీర్పు: యూపీ సీఎస్, డీజీపీలతో సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ భేటీ

ఈ నెల 17న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ పదవీ విరమణ పొందనుండటంతో 15వ తేదీ కంటే ముందుగానే అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తుది తీర్పు వెలువడే అవకాశం ఉందనే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా భద్రతా చర్యలు తీసుకోవాల్సిందిగా ఇప్పటికే అన్ని రాష్ట్ర్రాలతో పాటు ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ ని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అప్రమత్తం చేసింది.

Also read: అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

ఇదిలావుండగా, తాజాగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్ సైతం ఉత్తర్ ప్రదేశ్ ఉన్నతాధికారులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు యూపీ సీఎస్, ఆ రాష్ట్ర డీజీపిలతో సుప్రీం కోర్టులోని చీఫ్ జస్టిస్ చాంబర్ లో ఈ భేటీ జరగనుంది. దశాబ్ధాల తరబడి ఎన్నో సంచలనాలకు కేంద్ర బిందువైన అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీదు స్థల వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో యూపీలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

Trending News