Dadasaheb Phalke Award 2022: మనదేశంలో సినిమా రంగంలో ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ పాల్కే అవార్డు. ఈ ప్రతిష్టాత్మక అవార్డుకు బాలీవుడ్ సీనియర్ నటి ఆశా పరేఖ్‌కు (Asha Parekh) ఎంపికయ్యినట్లు సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంగళవారం ప్రకటించింది. ఇప్పటివరకు 52 మంది ఈ అవార్డును అందుకున్నారు. మొదటి గ్రహీత దేవికా రాణి. గతేడాది రజనీకాంత్ ఈ అవార్డును గెలుచుకున్నారు.
ఆశా పరేఖ్ (Asha Parekh) సినీ నటిగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా, భారత శాస్త్రీయ నృత్యకారిణి కూడా రాణించారు. ఆశాపరేఖ్ 1942 అక్టోబరు 2న గుజరాతీ కుటుంబంలో జన్మించారు. బాలనటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆమె 'దిల్ దేకే దేఖో'చిత్రంతో హీరోయిన్ గా అరంగేట్రం చేసింది. 95 చిత్రాలకు పైగా నటించింది. ఆమె 'కటి పతంగ్', 'తీస్రీ మంజిల్', 'లవ్ ఇన్ టోక్యో', 'ఆయా సావన్ ఝూమ్ కే', 'ఆన్ మీలో సజ్నా' మరియు 'మేరా గావ్ మేరా దేశ్' వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించింది. ఆమె చివరిసారిగా నటించిన చిత్రం ఆంఖోం పర్.
ఆశా పరేఖ్ హిందీతోపాటు గుజరాతీ, పంజాబీ, కన్నడ సినిమాల్లోనూ పని చేశారు. ఆమె 47 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ లో దాదాపు 40కిపైగా అవార్డులను అందుకున్నారు.‘'హిట్ గర్ల్'’గా పాపులర్ అయిన ఆమె ఆటోబయోగ్రఫీ పుస్తకం అదే పేరుతో తీసుకొచ్చారు. 1992లో పరేఖ్ పద్మశ్రీ పురస్కారాన్ని పొందారు. ఆమె సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ హెడ్‌గా 1998-2001 వరకు పనిచేశారు.
Also Read: Bimbisara OTT: ఓటీటీలోకి కల్యాణ్ రామ్ 'బింబిసార'.. స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎందులోనో తెలుసా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
బాలీవుడ్ సీనియర్ నటి ఆశాపరేఖ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు