Sitaram Yechury: కమ్యూనిస్ట్‌ పార్టీలో తీవ్ర విషాదం.. సీతారాం ఏచూరి కన్నుమూత..!

Sitaram Yechury Passes Away: సీనియర్‌ సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరీ (72) ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఐసీయూలో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్న ఈ కమ్యూనిస్ట్‌ నేత నేడు తుదిశ్వాస విడిచారు..

Written by - Renuka Godugu | Last Updated : Sep 12, 2024, 05:30 PM IST
Sitaram Yechury: కమ్యూనిస్ట్‌ పార్టీలో తీవ్ర విషాదం.. సీతారాం ఏచూరి కన్నుమూత..!

Sitaram Yechury Passes Away:  గత కొన్ని రోజులుగా ఎయిమ్స్‌లో ఐసీయూలో వెంటిలేషన్‌పై చికిత్స పొందుతున్న సీనియర్‌ సీపీఐ (ఎం) నేత సీతారాం ఏచూరీ (72) ఆరోగ్య పరిస్థితి విషమించి ఈరోజు కన్నుమూశారు.  ఊపిరితిత్తుల సంబంధిత ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నారని సీపీఐ వర్గాలు మొన్న సర్క్యూలర్‌ జారీ చేశాయి.. శ్వాసకోశ సంబంధిత సమస్యతో ఆయన గత నెల ఆగష్టు 19న ఆస్పత్రిలో చేరారు.

సీపీఐ (ఎం) జనరల్‌ సెక్రటరీ సీతారాం ఏచూరీ ఆరోగ్య పరిస్థితి విషమించింది. ఆయన ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతున్నారని కమ్యూనిస్ట్‌ పార్టీ వర్గాలు తెలిపాయి. సీనియర్‌ వైద్యులు ఆయన్ను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ చికిత్స అందించారు. సీతారాం ఏచూరీ ఆగష్టు 19న నిమోనియా వంటి ఛాతి ఇన్ఫెక్షన్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

ఆగస్టు 22న కోల్‌కత్తాలో జరిగిన బుద్ధదేవ్ భట్టాచార్య స్మారక సభకు ఆయన హాజరు కాలేదు. ఆసుపత్రి నుంచి వీడియో సందేశం పంపాడు.  ఈ మధ్య కాలంలోనే సీతారాం ఏచూరీ కంటి సంబంధిత సర్జరీ చేయించుకున్నారు.

రైలు ప్రయాణీకులకు శుభవార్త చెప్పిన కేంద్రం.. ఏఐ టెక్నాలజీతో అత్యాధునిక సదుపాయం...

సీతారాం ఏచూరీ ఎవరు?
మార్క్సిస్ట్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన సీతారాం ఏచూరీ 1952 ఆగష్టు 12న చెన్నైలో జన్మించారు. ఆయన పెరిగింది హైదరాబాద్‌లోనే ఆతర్వాత ఢిల్లీలోని సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. జేఎన్‌యూ నుంచి ఎంఏ పట్టా కూడా పొందారు. ఈయన మూడుసార్లు స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు అంతేకాదు సీతారాం ఏచూరీ 1975లో మన దేశంలో ఎమర్జెన్సీ సమయంలో విద్యార్థి దశలోనే ఎన్నో ఉద్యమాలు చేశారు అరెస్టు కూడా అయ్యారు. 1992 నుంచి ఆయన పోలిట్‌ బ్యూరో సభ్యుడుగా ఉన్నాడు. హరికిషన్‌ సింగ్‌ సంకీర్ణ నిర్మాణాన్ని ఈయన ముందుకు తీసుకెళ్లారు. 1996 యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం కోసం చిదంబరంతో కలిసి పనిచేశారు. 2005 నుంచి 2017 వరకు రాజ్యసభ ఎంపీగా కూడా ఏచూరీ పనిచేశారు.

70 ఏళ్లు పైబడినవారు కూడా ఆయుష్మాన్‌ భారత్‌ పరిధిలోకి.. పూర్తి వివరాలు ఇవే.. 

ఆయన ఫ్యామిలీ విషయానికి వస్తే సీతారాం ఏచూరీ ఇంద్రాణి మజుందార్‌ను వివాహం చేసుకున్నారు. వీరికి అశిలా ఏచూరీ, ఆశిష్‌ ఏచూరీ అని ఇద్దరు సంతానం ఉన్నారు. ఆ తర్వాత ఆయన జర్నలిస్ట్‌ అయిన సీమా చిస్తీని రెండో వివాహం కూడా చేసుకున్నారు. అయితే, కొవిడ్‌ సమయంలో సీతారాం కొడుకు ఆశిష్‌ చనిపోయారు.
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News