వైరల్ వీడియో: కోతికి స్టీరింగ్ ఇచ్చి సస్పెండైన డ్రైవర్

వైరల్ వీడియో: బస్సు నడిపిన కోతి

Updated: Oct 6, 2018, 05:43 PM IST
వైరల్ వీడియో: కోతికి స్టీరింగ్ ఇచ్చి సస్పెండైన డ్రైవర్

ఓ బస్సు డ్రైవర్ సరదా కోసం కోతిని స్టీరింగ్‌పై కూర్చోబెట్టి ప్రయాణీకుల ప్రాణాలను రిస్క్‌లో పెట్టాడు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరెలో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కర్ణాటక కేఎస్‌ఆర్‌టీసీకి బస్సు డ్రైవర్‌ ఒకరు స్టీరింగ్‌పై కోతిని కూర్చోబెట్టి బస్సును నడిపించాడు. డ్రైవర్‌తోపాటు కోతి కూడా స్టీరింగ్‌ను తిప్పుతూ కనిపించింది. కోతి స్టీరింగ్‌ మీద ఎక్కి కూర్చునప్పటికి డ్రైవర్‌ దాన్ని అడ్డుకోలేకపోయాడు. అంతేనా.. కోతి స్టీరింగ్‌ తిప్పుతుంటే గేర్‌ మారుస్తూ ఎంజాయ్ చేశాడు. ఇదంతా గమనిస్తున్న ఓ ప్రయాణీకుడు తన ఫోన్‌లో వీడియోను తీశాడు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దాంతో ఆ బస్సు డ్రైవర్‌ని అధికారులు సస్పెండ్‌ చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన ఆ వీడియోనూ మీరూ చూడండి..