Cibil Score: సిబిల్ స్కోర్. బ్యాంకుల్నించి ఎటువంటి రుణం కావాలన్నా అతి ముఖ్యమైన ప్రామాణికం ఇదే. సిబిల్ స్కోర్ క్రెడిట్ అత్యవసరం. ఈ స్కోర్ బాగుంటేనే రుణాలు అందుతాయి. సిబిల్ స్కోర్‌ను పెంచుకునే మార్గాలు కూడా చాలానే ఉన్నాయి. అవేంటో పరిశీలిద్దాం.
పర్సనల్, హోమ్, వెహికల్, బిజినెస్..ఇలా ఏ రుణం కావాలన్నా సిబిల్ స్కోర్(Cibil Score)బాగుండాల్సిందే. లేకుంటే రుణ సౌకర్యం అందదు. కేవలం సిబిల్ స్కోర్ సరిగ్గా లేక..190 మిలియన్ల మంది రుణాల్ని తీసుకునే అవకాశాన్ని కోల్పోయారనేది ప్రపంచ బ్యాంకు నివేదిక చెబుతోంది. ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించి సిబిల్ స్కోర్ పెంచుకునే మార్గాలు చాలానే ఉన్నాయి. అసలు సిబిల్ స్కోర్ ఎలా పెంచుకోవాలనేది పరిశీలించే ముందు సిబిల్ గురించి మరికొన్ని వివరాలు తెలుసుకుందాం. క్రెడిట్ స్కోర్ అనేది 3 వందల నుంచి 9 వందల వరకూ ఉండే మూడంకెల సంఖ్య. రుణం కోసం దరఖాస్తు చేసినప్పుడు ఆ లోన్ ఎందుకు ఇవ్వాలనే అంశాన్ని బ్యాంకులు పరిగణలో తీసుకునే అతి ముఖ్యమైన బెంచ్ మార్క్ ఇది. స్కోర్ తక్కువగా ఉంటే బ్యాంకులు రుణాన్ని తిరస్కరిస్తాయి. కొన్ని పద్ధతులు పాటిస్తే ఉద్యోగస్థులు సిబిల్ స్కోర్ సులభంగా పెంచుకోవచ్చు.
సురక్షితమైన క్రెడిట్ కార్డును(Credit Card)తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో బ్యాంకుల్నించి సెక్యూరిటీ లేని క్రెడిట్ కార్డుల్ని తీసుకోవల్సి ఉంటుంది. అంతేకాదు బ్యాంకులు లేదా ఫైనాన్స్ కంపెనీలు నిబంధనలకు విరుద్ధంగా క్రెడిట్ కార్డులు అందిస్తుంటాయి. ఇందులో సెక్యూర్ క్రెడిట్ కార్డులు 75-80 శాతం సిబిల్ స్కోర్ బాగుండేందుకు దోహదం చేస్తాయి. సకాలంలో ఈఎంఐ చెల్లించడం అలవాటు చేసుకోవాలి. ఈఎమ్ఐ అయినా లేదా క్రెడిట్ కార్డు బిల్లు అయినా సకాలంలో చెల్లించాలి. ఈసీఎస్ సేవల్ని అనుసంధానం చేసుకుంటే బాగుంటుంది. కొన్నిసార్లు వివిధ కారణాలతో ఈఎంఐ మొత్తం చెల్లించలేకపోవచ్చు. ఆ పరిస్థితుల్లో డీఫాల్ట్ నుంచి తప్పించుకునేందుకు కనీసం కొంత మొత్తాన్ని చెల్లిస్తే బాగుంటుంది. ఎక్కువ సార్లు లోన్ కోసం అప్లై చేసినా సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడుతుంది. అందుకే ఆ పని చేయకూడదు. సిబిల్ స్కోర్ ఎక్కువగా ఉంటే తక్కువ వడ్డీరేటుతో రుణం పొందేందుకు అవకాశముంటుంది. మార్టగేజ్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్, కారు లోన్, హౌసింగ్ లోన్, బిజినెస్ లోన్, ఫిక్స్డ్ డిపాజిట్ లోన్ వంటివి సురక్షిత రుణాల్లో వస్తాయి. వీటి వల్ల సిబిల్ స్కోర్(How to improve cibil score) పెరుగుతుంది. ఓ బ్యాంకు తిరస్కరిస్తే మరో బ్యాంకుకు అప్లై చేయడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే సిబిల్ స్కోర్ తగ్గిపోతుంది. ఈ సూచనలన్నీ పాటిస్తే కచ్చితంగా మీ సిబిల్ స్కోర్ మెరుగుపడుతుంది.
Also read: Chief Justice NV Ramana: భారత న్యాయస్థానాలపై సుప్రీంకోర్టు ఛీఫ్ జస్టిస్ ఎన్‌వి రమణ కీలక వ్యాఖ్యలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook