మధ్యప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ?

మధ్యప్రదేశ్‌లో దోబూచులాడుతున్న విజయం

Last Updated : Dec 11, 2018, 09:32 PM IST
మధ్యప్రదేశ్‌కి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ?

భోపాల్: మధ్యప్రదేశ్ ఎన్నికల్లో విజయం బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య దోబూచులాడుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్ రాత్రి 8:30 గంటలకు కూడా ఓ కొలిక్కి రాలేదు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే మధ్యప్రదేశ్‌లోనే అత్యధికంగా 230 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరగాల్సి వుండటంతో ఇక్కడ ఫలితం తేలడం కూడా అంతే ఆలస్యమైంది. కడపటి వార్తలు అందే సమయానికి బీజేపీ 31 స్థానాలు గెలుచుకోగా, కాంగ్రెస్ పార్టీ 29 స్థానాలు గెలుచుకుంది. అయితే, ఆధిక్యం విషయానికొస్తే, బీజేపీ 79 స్థానాల్లో ఆధిక్యంలో వుండగా కాంగ్రెస్ పార్టీ 84 స్థానాల్లో ఆధిక్యంలో వుంది. దీంతో ఫలితం ఏ క్షణం ఏ పార్టీని వరిస్తుందో ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి. 

2003 నుంచి మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో వుండగా 2005 తర్వాత నుంచి శివరాజ్ సింగ్ చౌహన్ ముఖ్యమంత్రిగా వుంటూ వస్తున్నారు. ఈ ఎన్నికల్లోనూ ఎలైగానా గెలిచి తన పీఠాన్ని పదిలం చేసుకోవాలని శివరాజ్ సింగ్ చౌహన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. అలా కాకుండా ఒకవేళ ఫలితం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వచ్చినట్టయితే, ఆ పార్టీ తరపున సీనియర్ నేత కమల్ నాథ్‌తోపాటు యువనేత జ్యోతిరాదిత్య సింథియా కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. అంతిమంగా పార్టీ అధిష్టానం తీసుకునే నిర్ణయాన్నే శిరసావహిస్తామని మధ్యప్రదేశ్‌కి చెందిన కాంగ్రెస్‌ పార్టీ నేతలు చెబుతున్నారు.

Trending News