Karnataka High Court: కేసు విచారణ జరుగుతుండగా-లైవ్‌లోనే స్నానం చేసిన వ్యక్తి

Semi naked man appears during court virtual hearing : కర్ణాటక హైకోర్టులో వర్చువల్‌గా జరిగిన ఓ కేసు విచారణ సందర్భంగా ఓ వ్యక్తి దుస్తులు లేకుండా ప్రత్యక్షమయ్యాడు. ఓవైపు కేసు విచారణ జరుగుతుండగా... అతను లైవ్‌లోనే 20 నిమిషాల పాటు స్నానం చేశాడు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 1, 2021, 01:33 PM IST
  • సెక్స్ స్కాండల్ కేసుపై వర్చువల్ విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు
  • విచారణ సందర్భంగా దుస్తులు లేకుండా కనిపించి ఓ వ్యక్తి
  • అతనికి నోటీసులు జారీ చేయాలని హైకోర్టు ఆదేశాలు
 Karnataka High Court: కేసు విచారణ జరుగుతుండగా-లైవ్‌లోనే స్నానం చేసిన వ్యక్తి

Semi naked man appears during court virtual hearing : కర్ణాటకలో సంచలనం రేపిన మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి సెక్స్ స్కాండల్ (Karnataka Sex Scandal) కేసు విచారణ సందర్భంగా హైకోర్టులో (High Court) అనుకోని ఘటన చోటు చేసుకుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసు విచారణ జరుగుతున్న సమయంలో... ఓ వ్యక్తి అర్ధనగ్నంగా ప్రత్యక్షమయ్యాడు. అంతేకాదు, వీడియో లైవ్ స్ట్రీమ్‌లో 20 నిమిషాల పాటు స్నానం చేస్తూ కనిపించాడు. ఈ అనుకోని పరిణామం పట్ల బాధితురాలి తరుపు న్యాయవాది తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయగా... హైకోర్టు బెంచ్ అతనిపై చర్యలకు ఆదేశించింది.

వీడియో కాన్ఫరెన్స్ జరుగుతున్న సమయంలో అతను స్నానం చేస్తూ కనిపించడాన్ని న్యాయవాది ఇందిరా జైసింగ్ న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్లారు. అతను ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యకు పాల్పడ్డాడని... ఒకరకంగా ఇది తనను వేధింపులకు (Harassment) గురిచేయడమేనని అన్నారు. 'కోర్టులో ఒక మహిళా న్యాయవాది వాదనలు వినిపిస్తున్న సమయంలో ఓ వ్యక్తి ఒంటి మీద దుస్తులు లేకుండా కనిపించాడు. అసలేం జరుగుతోంది మైలార్డ్... కోర్టు విచారణ సందర్బంగా ఇలా దుస్తులు లేకుండా కనిపించడం నేరం. చూస్తుంటే.. అతను స్నానం చేసినట్లు కనిపిస్తోంది. ఇది కోర్టు ధిక్కరణ కిందకే వస్తుంది.' అని పేర్కొన్నారు. దీనికి సంబంధించి తాను డిజిటల్ ఆధారాలు కూడా సమర్పిస్తానని ఇందిరా జైసింగ్ కోర్టుకు (Karnataka High Court) తెలిపారు. అతను ఉజిరేలోని ఎస్‌డీఎం కాలేజీకి చెందిన శ్రీధర్ భట్ అని వెల్లడించారు.

ఈ కేసు ఆన్‌లైన్ విచారణ సందర్భంగా లైవ్‌లో దాదాపు 80 మంది ఉన్నారు. అంతమంది ముందు ఆ వ్యక్తి నిస్సిగ్గుగా వ్యవహరించడంపై (Man bathing during court virtual hearing) హైకోర్టు డివిజనల్ బెంచ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. వెంటనే అతని ఆచూకీ తెలుసుకుని నోటీసులివ్వాలని ఆదేశించింది. కాగా, ఇందిరా జైసింగ్ శ్రీధర్ భట్ వ్యవహారం గురించి ప్రస్తావించిన వెంటనే.. అతను వీడియో కాన్ఫరెన్స్ నుంచి లాగ్ అవుట్ అయ్యాడని పలువురు న్యాయవాదులు తెలిపారు.

Also Read: Omicron: మహారాష్ట్రకు ఒమిక్రాన్ టెన్షన్-రిస్క్ కంట్రీస్ నుంచి వచ్చిన ఆరుగురికి కరోనా

ఇక ఈ కేసు విషయానికి వస్తే.. మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి ఓ మహిళతో జరిపిన రాసలీలలు కొద్ది నెలల క్రితం వెలుగుచూసిన సంగతి తెలిసిందే. దినేష్ అనే సామాజిక కార్యకర్త మొదట ఈ వీడియోను బయటపెట్టాడు. రమేష్ జర్కిహోళిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు. అయితే ఆ తర్వాత కొద్దిరోజులకే అతను కేసు ఉపసంహరించుకున్నాడు. ఈ వీడియో (Sex Scandal) వ్యవహారం పెను దుమారం రేపడంతో మంత్రి పదవికి రమేష్ జర్కిహోళి రాజీనామా చేయక తప్పలేదు. ప్రభుత్వం దీనిపై సిట్ విచారణకు ఆదేశించగా ఇటీవలే తుది నివేదికను కోర్టుకు సమర్పించారు. ప్రస్తుతం ఆ నివేదికపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News