రూ.1,099 కే ఎక్చేంజ్ ఆఫర్‌పై 6GB RAM కలిగిన షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌!!

ఫ్లిప్‌కార్ట్‌లో ఎక్చేంజ్ ఆఫర్‌పై 6GB RAM కలిగిన షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌!!

Last Updated : Dec 10, 2018, 07:01 PM IST
రూ.1,099 కే ఎక్చేంజ్ ఆఫర్‌పై 6GB RAM కలిగిన షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌!!

న్యూఢిల్లీ: ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్స్ ఎప్పుడో ముగిశాయి కానీ ఫ్లిప్‌కార్ట్‌పై ప్రస్తుతం అందుబాటులో వున్న ఓ ఆఫర్ మాత్రం స్మార్ట్ ఫోన్ యూజర్స్‌ని ఇంకా ఊరిస్తోంది. అదే షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌పై అందుబాటులో వున్న ఎక్స్‌చేంజ్ మేళా ఆఫర్. గత నవంబర్ ఆఖరి వారంలో మార్కెట్‌లోకి వచ్చిన ఈ షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో స్మార్ట్ ఫోన్‌ వచ్చీ రావడంతోనే యూజర్స్‌ని తనవైపు ఆకర్షించుకుంది. బ్లాక్, రోజ్ గోల్డ్, బ్లూ, రెడ్ కలర్లలో రూపొందిన ఈ స్మార్ట్ ఫోన్‌ 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 13,999 కాగా ఇదే మోడల్‌లో 6GB RAM కలిగిన 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ వెర్షన్ ధర రూ. 15,999 గా వుంది. 

అయితే, 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రోపై ప్రస్తుతం ఫ్లిప్ కార్ట్ రూ.13,000 వరకు ఎక్చేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఆఫర్ వర్తించినట్టయితే, సదరు వినియోగదారులు కేవలం రూ.999లకే 4GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. అలాగే, 6GB RAM, 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తున్న షియోమి రెడ్‌మి నోట్ 6 ప్రో ఫోన్ ధర రూ.15,999 కాగా ఫ్లిఫ్‌కార్ట్ ఈ ఫోన్ అమ్మకాలపై రూ. 14,900 వరకు ఎక్సేంజ్ ఆఫర్ అందిస్తోంది. ఈ ఎక్చేంజ్ ఆఫర్ ప్రకారం రూ.1,099కే ఈ స్మార్ట్ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు.

Trending News