లక్నో: వచ్చే ఏడాదిలో జనవరి నుంచి మార్చి చివరి తేదీ మధ్యలో పెళ్లిళ్లు ప్లాన్ చేసుకున్న వారికి షాక్‌ని ఇస్తూ ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ విచిత్రమైన ఆదేశాలు జారీచేసింది. అయితే, ఆ రాష్ట్ర వాసులు అందరికీ కాదు.. కుంభమేళాకు వేదికైన ప్రయాగ్‌రాజ్ (అలహాబాద్ పేరును ఇటీవలే యూపీ సర్కార్ ప్రయాగ్‌రాజ్‌గా పేరు మార్చింది) వాసులకు మాత్రమే వర్తిస్తుంది. అవును, వచ్చే ఏడాది జనవరి నుంచి మార్చి వరకు పెళ్లిళ్లు పెట్టుకోవద్దని, ఒకవేళ ఇప్పటికే ఏమైనా నిర్ణయించి ఉంటే, వాటిని మరో చోటుచు మార్చుకోవడం కానీ లేదా రద్దు చేసుకోవడం కానీ చేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ప్రయాగ్‌రాజ్‌లో వచ్చే ఏడాది ఆరంభం నుంచి కుంభమేళలో జరగనున్నందున అందరి సౌకర్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని సర్కార్ తమ ఆదేశాల్లో పేర్కొన్నట్టు సమాచారం.