పెట్రోల్, డీజిల్, మద్యంపై భారీగా కరోనా టాక్స్

కరోనావైరస్ నివారణ కోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 

Last Updated : May 7, 2020, 03:03 AM IST
పెట్రోల్, డీజిల్, మద్యంపై భారీగా కరోనా టాక్స్

లక్నో: కరోనావైరస్ నివారణ కోసం లాక్‌డౌన్ విధించిన నేపథ్యంలో పడిపోయిన ఆదాయాన్ని తిరిగి పుంజుకోవడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలు తగిన ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కుంటున్నాయి. అందులో భాగంగానే ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో పాటు మద్యంపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేవలం మందుబాబులపైనే కాకుండా వాహనదారులపై కూడా ప్రభావం చూపనుంది. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి సురేష్ ఖన్నా మీడియాతో మాట్లాడుతూ.. తమ రాష్ట్ర ప్రభుత్వం మద్యంపై కరోనా టాక్స్ విధించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఫలితంగా యూపీ సర్కార్‌కి అదనంగా రూ.2,350 కోట్ల ఆధాయం లభించనుందని మంత్రి సురేష్ ఖన్నా పేర్కొన్నారు. 

Also read : షోయబ్ అక్తర్ బయోపిక్.. తెరపైకి సల్మాన్ ఖాన్ పేరు

మంత్రి సురేశ్ ఖన్నా వెల్లడించిన వివరాల ప్రకారం పెరిగిన మద్యం ధరలు ఇలా ఉన్నాయి.
దేశీ లిక్కర్ రూ.5
180 ఎంఎల్ మిడియం లెవెల్ ఆల్కహాల్ రూ.10
500 ఎంఎల్ మిడియం లెవెల్ ఆల్కహాల్ రూ.20
500 ఎంఎల్ కంటే ఎక్కువుంటే మిడియం లెవెల్ ఆల్కహాల్ రూ.30
180 ఎంఎల్ ప్రీమియం బ్రాండ్ ఆల్కహాల్ రూ.20
500 ఎంఎల్ ప్రీమియం బ్రాండ్ ఆల్కహాల్ రూ.30
500 ఎంఎల్ కంటే ఎక్కువుంటే ప్రీమియం బ్రాండ్ ఆల్కహాల్ రూ.50

Also read : Liquor Shops: మందు బాబులకు షాక్ ఇచ్చిన అధికారులు

ఫారెన్ లిక్కర్ విషయానికొస్తే, 180 ఎంఎల్ ఫారిన్ లిక్కర్ ధర రూ.100, 500 ఎంఎల్ ఫారెన్ లిక్కర్ ధర రూ.200, 500 ఎంఎల్ కంటే ఎక్కువుంటే విదేశీ మద్యం ధరను రూ. 400 పెంచినట్టు మంత్రి సురేశ్ ఖన్నా వెల్లడించారు. అలాగే లీటర్ పెట్రోల్‌పై రూ2. లీటర్‌ డీజిల్‌పై 1 రూపాయిని పెంచుతున్నామని.. తద్వారా రాష్ట్రానికి రూ. 2,070 ఆదాయం అదనంగా వస్తుందని మంత్రి ఖన్నా స్పష్టంచేశారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News