Guaranteed Pension: భార్యపేరుతో NPS ఖాతా తెరవండి.. నెలకు రూ.44,793 పెన్షన్ పొందండి

NPS Pension For Wife: మీరు ఉద్యోగం చేస్తోంటే...మీ భార్య హోమ్ మేకర్ అయితే మీరు భవిష్యత్తుపై ఏదో ఒక ప్లాన్ చేయడం ప్రారంభించే ఉంటారు. 

Last Updated : Oct 6, 2020, 11:12 AM IST
    • మీరు ఉద్యోగం చేస్తోంటే...మీ భార్య హోమ్ మేకర్ అయితే మీరు భవిష్యత్తుపై ఏదో ఒక ప్లాన్ చేయడం ప్రారంభించే ఉంటారు.
    • భవిష్యత్తులో మీ భార్య డబ్బు కోసం ఇతరులపై ఆధారపడి ఉండకూడదు అనుకుంటే.. ఆమె కోసం రెగ్యులర్ ఇంకమ్ సోర్స్ ఏర్పాటు చేయడం ఉత్తమం.
Guaranteed Pension: భార్యపేరుతో NPS ఖాతా తెరవండి.. నెలకు రూ.44,793 పెన్షన్ పొందండి

NPS Pension For Wife: మీరు ఉద్యోగం చేస్తోంటే...మీ భార్య హోమ్ మేకర్ అయితే మీరు భవిష్యత్తుపై ఏదో ఒక ప్లాన్ చేయడం ప్రారంభించే ఉంటారు. భవిష్యత్తులో మీ భార్య డబ్బు కోసం ఇతరులపై ఆధారపడి ఉండకూడదు అనుకుంటే.. ఆమె కోసం రెగ్యులర్ ఇంకమ్ సోర్స్ ఏర్పాటు చేయడం ఉత్తమం. 

ALSO READ| NPS Alert: NPS ఖాతాదారులకు శుభవార్త.. ఇంట్లో కూర్చొనే నామినీ వివరాలు మార్చే సదుపాయం

ఇలా చేయాలి అనుకుంటే మీ భార్య పేరుపై నేషనల్ పెన్షన్ సిస్టమ్ ( National Pension System ) ఎకౌంట్ తెరవండి. 60 సంవత్సరాల తరువాత మీ భార్యకు భారీ మొత్తంలో డబ్బు చేతికి అంది వస్తుంది. దాంతో పాటు ప్రతీ నెల పెన్షన్ రూపంలో నగదు అందుతుంది. అయితే పెన్షన్ స్కీమ్ లో చేరే ముందే మీరు మీ భార్యకు ( Wife ) నెలకు ఎంత డబ్బు అందితే బాగుంటుందో ఒక అంచనాకు రావాల్సి ఉంటుంది. 60 సంవత్సరాల తరువాత అందుతుంది కాబట్టి అప్పటి పరిస్థితులకు తగిన విధంగా ప్లాన్ చేయాలి.

NPS ఎకౌంట్ తెరవండి
మీ జీవిత భాగస్వామి పేరుపై మీరే NPS ఎకౌంట్ తెరవగలరు. మీ సౌలభ్యాన్ని బట్టి సంవత్సారాని ఒక సారి లేదా నెలకు ఇంత అని డబ్బు చెల్లించవచ్చు. మీరు రూ.1,000 తో కూడా మీ భార్య పేరుపై ఖాతా తెరవచ్చు. అది 60 ఏళ్లకు NPS స్కీమ్ మెచ్యూర్ అవుతుంది. కొత్తగా ఏర్పడిన రూల్స్ ప్రకారం 65 సంవత్సరాల వరకు ఎకౌంట్ కొనసాగించవచ్చు.

నెలకు రూ.5,000లతో రూ. కోటి 14 లక్షల ఫండ్
ఉదాహరణ: 
ప్రస్తుతం మీ భార్య వయసు 30 ఏళ్లు అనుకుంటే..NPS ఖాతాలో మీరు ఇప్పటి నుంచి రూ.5,000 సేవ్ చేయడం ప్రారంభించారు అనుకొండి. దానిపై మీకు 10 శాతం రిటర్న్ వచ్చినా.. 60 ఏళ్ల వయసులో ఆమెకు రూ. కోటి 14 లక్షలు వస్తాయి. ఏకమొత్తంగా రూ.45 లక్షలు చేతికి వస్తాయి. తరువాత నెలకు రూ.45, 000 చొప్పున పెన్షన్ కూడా వస్తుంది. 

ALSO READ|  WhatsApp Banking: వాట్సాప్ తో బ్యాంకింగ్ చేసేయండి.. మీ బ్యాంకు వ్యాట్సాప్ నెంబర్లు ఇవే

ఏకమొత్తంగా వచ్చే డబ్బు వివరాలు
వయస్సు-30 సంవత్సరాలు
నెలకు కంట్రిబ్యూషన్ - రూ. 5,000
పెట్టుబడిపై రిటర్న్ - 10 శాతం
మెచ్యూరిటీ సమయంలో మొత్తం ఫండ్ విలువ రూ 1,11,98,471
ఏన్యూటీ ప్లాన్ కొనుగోలు చేయడానికి అయ్యే మొత్తం రూ.44,79,388
దీనిపై అన్యుటీ రిటర్న్ 8 శాతం ఇస్తే - 67,19,083
నెలకు పెన్షన్- రూ.44,793

A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే  ZEEHINDUSTAN App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

IOS Link - https://apple.co/3loQYeR

Trending News