న్యూడిల్లీ : 71వ గణతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ దేశ పౌరులను ఉద్దేశించి ప్రసంగించారు. దేశప్రజలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం సోదరభావాలకు కట్టుబడి ఉండాలని అన్నారు. మహాత్మా గాంధీ బోధనలు, విలువలు, దైనందిన జీవితం నేటి యువతకు ఆదర్శమన్నారు.
దేశ యువతకు సందేశమిస్తూ యువత నవభారత నిర్మాణానికి నాయకత్వం వహించాలని, గాంధీ బోధలను అలవర్చుకోవాలని, ఆయన చూపిన అహింసా మార్గాన్ని ఎంచుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రపతి, ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) సాధించిన విజయాలపై, నూతన ఆవిష్కరణలపై, దేశం ఎంతగానో గర్వపడుతోందని, ఇస్రో మరిన్ని విజయాలు సాధించాలని దేశం కోరుకొంటోందని తెలియజేశారు.
దేశ అభివృద్ధికి బలమైన అంతర్గత భద్రత దాని ప్రాముఖ్యతను అధ్యక్షుడు కోవింద్ నొక్కిచెప్పారు. సాయుధ దళాలు, పారా మిలటరీ, అంతర్గత భద్రతా దళాల పట్ల ఆయన ప్రశంసలు కురిపించారు. దేశం యొక్క సమగ్రతను,ఐక్యతను కాపాడటానికి వారు చేసిన త్యాగాలు మరువలేనివని ఆయన కొనియాడారు. రైతులు, వైద్యులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు, పారిశ్రామిక శక్తి వంటి అనేక ఇతర రంగాలలో చేసిన సేవలని రాష్ట్రపతి ప్రశంసించారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..