3 Ways To Prevent White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. తప్పకుండా ఈ 3 చిట్కాలు ట్రై చేయాల్సిందే!

Prevent White Hair Naturally: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగించక పోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యం కోసం ప్రతి రోజూ కొబ్బరి నూనెను వినియోగించాల్సి ఉంటుంది..

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 16, 2023, 09:21 AM IST
3 Ways To Prevent White Hair: తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్నారా.. తప్పకుండా ఈ 3 చిట్కాలు ట్రై చేయాల్సిందే!

3 Ways To Prevent White Hair Naturally: ప్రస్తుతం తెల్ల జుట్టు సమస్యలతో అన్ని వయసుల వారు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యలు రావడానికి చాలా కారణాలున్నప్పటికీ ప్రతి రోజూ చేసే పలు తప్పుడు పనుల కారణంగా,  జన్యుపరమైన కారణంగా కూడా ఇలాంటి సమస్యలు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఈ తెల్ల జుట్టు సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి పలు రకాల నియమాలు పాటించాల్సి ఉంటుంది. అంతేకాకుండా జీవనశైలిలో మార్పులు కూడా చేసుకోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

చిన్న వయస్సులోనే జుట్టు నెరిసిపోవడానికి కారణాలు ఇవే:

  • అనారోగ్యకరమైన ఆహారం ప్రతి రోజూ తినడం.
  • అనవసరమైన టెన్షన్ కారణంగా..
  • తరచుగా అనారోగ్య సమస్యలకు గురికావడం.
  • విటమిన్, ఖనిజ లోపం వల్ల తెల్ల జుట్టు సమస్యలు వస్తాయి.
  • రసాయనాలు అధికంగా ఉండే షాంపులు వాడడం వల్ల
  • జన్యుపరమైన కారకాల వల్ల కూడా వస్తాయి.

జుట్టు నెరిసిపోవడాన్ని ఇలా తగ్గించవచ్చు.!
1. రోజూ షాంపూ వాడటం మానుకోండి:
ప్రస్తుతం చాలా మంది వెంట్రుకలు అందంగా కనిపించుకునేందుకు వివిధ రకాల రసాయనాలతో కూడిన షాంపూలను వినియోగిస్తున్నారు. వీటికి బదులుగా ఆర్గానిక్ షాంపూలను వినియోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి షాంపూలను అతిగా వినియోగించకుండా మానుకోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

2. హెల్తీ ఫుడ్స్ తినండి:
ఆయిలీ, ఫాస్ట్, జంక్ ఫుడ్స్ ఎక్కువగా తినడం వల్ల కూడా జుట్టు తొందరగా నెరసిపోతుందని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నవయసులోనే జుట్టు తెల్లబడటం వంటి సమస్యలతో బాధపడేవారు తప్పకుండా ప్రతి రోజూ హెల్తీ ఫుడ్స్ తీసుకోవడం చాలా మంచిది.

3. కొబ్బరి నూనె వాడండి:
ప్రస్తుతం చాలా మంది జుట్టుకు రసాయనాలతో కూడిన నూనెలు అతిగా వినియోగిస్తున్నారు. అయితే వాటికి బదులుగా కొబ్బరి నూనె ప్రతి రోజూ వినియోగించడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే కెమికల్స్‌తో కూడిన హెయిర్ ఆయిల్స్‌ని వినియోగించకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

Also read: Krithi Shetty Photos: అందాల ఆరబోతలో హద్దులు దాటేస్తున్న కృతి శెట్టి..బాడీకాన్ డ్రెస్సులో థైస్ షో!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News