Anjeer Side Effects: ఉదయం పూట అంజీర్‌ని ఇలా తింటున్నారా.. అయితే ఈ తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు..!

Anjeer Side Effects: చాలా మంది అనారోగ్య సమస్యలతో బాధపడేవారు డ్రై ఫ్రూట్స్‌ను అతిగా తింటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి పొట్ట సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2023, 09:52 AM IST
Anjeer Side Effects: ఉదయం పూట అంజీర్‌ని ఇలా తింటున్నారా.. అయితే ఈ తీవ్ర అనారోగ్య సమస్యలు తప్పవు..!

Anjeer Side Effects: వాతావరణ కాలుష్యం పెరగడం వల్ల, ఆధునిక జీవన శైలి కారణంగా చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అయితే చాలా మంది శరీర బలహీనతల సమస్యతో కూడా బాధపడుతున్నారు. అయితే ఇలాంటి సమస్యల నుంచి నుంచి ఉపశమనం పొందడానికి అంజీర్‌ పండ్లను తప్పకుండా వినియోగించాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో అధిక పరిమాణంలో  ఔషధ గుణాలు ఉంటాయి. కాబట్టి శరీరాన్ని అనారోగ్య సమస్యల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడేందుకు కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. అయితే ఆరోగ్యానికి చాలా మంచిదని విచ్చల విడిగా తింటున్నారు. అయితే ఇలా చేయడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యల వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

అత్తి పండ్లలో ఉండే పోషకాలు:
అంజీర్‌ పండ్లలో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల బాడీకి విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్ వంటి పోషకాలు అందుతాయి. అంతేకాకుండా శరీర రోగనిరోధ శక్తిని పెంచి ఎముకలను బలోపేతం చేయడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా మధుమేహం, రక్త పోటును నియంత్రించడానికి కీలకంగా సహాయపడుతుంది.

అంజీర్‌ను అతిగా తినడం వల్ల కలిగే దుష్ప్రభావాలు ఇవే:
కిడ్నీల్లో రాళ్ల సమస్యలకు కారణం కావొచ్చు:

అంజీర్‌ పండ్లలో ఆక్సలేట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా అధిక పరిమాణంలో తింటే కిడ్నీల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచే అవకాశాలున్నాయి. అంతేకాకుండా ఇంతముందు రాళ్ల సమస్యలతో బాధపడుతుంటే తీవ్ర నొప్పులకు దారి తీయోచ్చని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

కడుపు నొప్పి:
అంజీర్‌ను అతిగా తినడం వల్ల జీర్ణక్రియ సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలున్న అతిగా తినడం వల్ల చాలా రకాల అనారోగ్య సమస్యలతో పాటు జీర్ణక్రియపై చెడు ప్రభావం పడే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మైగ్రేన్ కారణం:
అంజీర్‌ పండ్లలో సల్ఫైట్ అధిక పరిమాణంలో లభిస్తుంది. దీని కారణంగా మైగ్రేన్ సమస్య, తలనొప్పి ఇతర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి వీటిని అతిగా తినకూడదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

దంతాలను బలహీన:
అంజీర్‌ పండ్లలో కార్బోహైడ్రేట్ల పరిమాణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని అతిగా తినడం వల్ల దంతాల సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇంత ముందే దంతాల సమస్యలతో బాధపడేవారు వీటిని అతిగా తినకపోవడం చాలా మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దానిని స్వీకరించే ముందు తప్పనిసరిగా వైద్య సలహా తీసుకోవాలి. ZEE NEWS దానిని ధృవీకరించలేదు.)

Also Read: Vaikunta Ekadasi: తిరుమల శ్రీవారి హుండీకి రికార్డు స్థాయి ఆదాయం.. చరిత్రలో అన్ని రికార్డులు బ్రేక్   

Also Read: Gade Venkata Reddy: భార్య నగలు తాకట్టు పెట్టా.. 70 ఎకరాలు అమ్ముకున్నా.. వైసీపీ జడ్పీటీసీ ఆవేదన 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News