Health Benefits Of Bananas: అరటి పండు అంటే మనందరికీ తెలిసిన, రుచికరమైన, పోషకాలతో నిండిన పండు. ఇది చాలా మార్కెట్లో సులభంగా లభిస్తుంది. దాదాపు అందరికీ నచ్చుతుంది. అరటి పండు కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. దీని తినడం వల్ల డయాబెటిస్ రోగులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనేది మనం తెలుసుకుందాం.
అరటి పండు రక్తపోటను నియంత్రించడంలో కీలక ప్రాత పోషిస్తుంది. దీంతో పాటు కండరాల పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ప్రతిరోజు ఉదయం అరటి పండు తినడం వల్ల ఇందులో ఉండే విటమిన్ బి6 మెదడు ఆరోగ్యాన్నికి, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అరటిపండులో ఉండే విటమిన్ సి వ్యాధుల నుంచి రక్షిస్తుంది, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఫైబర్ ఎక్కువగా లభించే పదార్థాల్లో అరటి పండు ఒకటి. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది, బరువును తగ్గించడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేసిన తర్వాత లేదా శారీరకంగా కష్టపడిన తర్వాత అరటి పండు తినడం వల్ల శక్తి వెంటనే లభిస్తుంది.
అరటి పండు ఎలా తీసుకోవచ్చు?
అరటి పండును ఎన్నో విధాలుగా తినవచ్చు. దీని బ్రేక్‌ఫాస్ట్‌లో తినవచ్చు. లేదా అరటిపండు నేరుగా తినడానికి ఇష్టపడనివారు స్మూతీలు తయారు చేసుకొని తినవచ్చు. ఇది తయారు చేసుకోవడం ఎంతో సులభం. ముందు పాలు, పెరుగు, తేనె మిక్స్ చేసుకొని తయారు చేసుకోవడమే. మరింత సులవుగా తయారు చేసుకొనేవాటిలో షేక్ ఒకటి. దీని కోసం అరటి పండును పాలు, మంచు కలిపి షేక్స్ చేసుకోవడమే. కేక్‌లు, బిస్కెట్లు, పాన్ కేక్స్ వంటి వాటిలో అరటి పండును ఉపయోగిస్తారు. అరటి పండుతో ఐస్ క్రీం తయారు చేస్తారు.
అరటి పండును ఎప్పుడు తినాలి:
అరటి పండును ఉదయం ఖాళీ కడుపుతో తింటే మంచిది.
వ్యాయామం చేసిన తర్వాత అరటి పండు తినడం వల్ల శక్తి వస్తుంది.
రాత్రి పూట అరటి పండు తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ముఖ్యమైన విషయాలు:
అరటి పండును ఎక్కువగా తింటే బరువు పెరగవచ్చు.
చాలా పండిన అరటి పండును తినడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అరటి పండు చాలా పోషక విలువలు కలిగిన పండు. దీన్ని రోజువారి ఆహారంలో భాగంగా చేర్చుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అయితే, ఎప్పుడు, ఎంత తినాలి అన్నది మీ ఆరోగ్య పరిస్థితులను బట్టి మారుతుంది.
Also Read: Weight Loss Upma Recipe: శరీర బరువును తగ్గించే బ్రౌన్ ఉప్మా.. రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter, Facebook