Benefits Of Rock Salt: తరచుగా మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తున్నాయా? గ్లాస్ నీటిలో ఈ ఉప్పును కలుపుకొని తాగండి..

Benefits Of Rock Salt: రాక్ సాల్ట్‌ను ప్రతిరోజు వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయి. ఇందులో ఉండే గుణాలు శరీరంలోని అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు తప్పకుండా ఈ సాల్ట్ ని వినియోగించండి.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 22, 2023, 08:32 PM IST
Benefits Of Rock Salt: తరచుగా మలబద్ధకం, గ్యాస్ సమస్యలు వస్తున్నాయా? గ్లాస్ నీటిలో ఈ ఉప్పును కలుపుకొని తాగండి..

Benefits Of Rock Salt: ఉప్పు ఆహారాలకు రుచిని జోడించేందుకు సహాయపడుతుంది. అందుకే అందరూ ఆహారాల్లో ఉప్పును వినియోగిస్తూ ఉంటారు. ప్రస్తుతం చాలామంది ఉప్పును అతిగా తీసుకుంటూ ఉంటున్నారు. ఇలా తీసుకోవడం శరీరానికి హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తెల్ల ఉప్పులో ఉండే కొన్ని లవణాలు శరీరంలోని అనేక రకాల అవయవాలపై దాడి చేస్తాయని, అతిగా ఉప్పును తినడం వల్ల అనేక రకాల సమస్యలు రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే తెల్ల ఉప్పుకు బదులుగా రాక్ సాల్ట్‌ను వినియోగించడం వల్ల శరీరానికి బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. రాక్ సాల్ట్‌లో ఉండే ఆయుర్వేద గుణాలు అన్ని రకాల అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. ప్రతిరోజు దీనిని వినియోగించడం వల్ల శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో మనం ఈరోజు తెలుసుకుందాం.

జీర్ణశక్తిని పెంపొందిస్తుంది: 
రాక్ సాల్ట్  రసాయన నామం సోడియం క్లోరైడ్.. ఈ ఉప్పును ఎక్కువగా దక్షిణ భారతీయులు వినియోగిస్తూ ఉంటారు. కడుపునొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ ఉప్పును ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగడం వల్ల సులభంగా ఉపశమనం లభిస్తుంది. అంతేకాకుండా జీర్ణ క్రియ కూడా బలంగా మారుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచుగా పొట్ట నొప్పి, పొట్టలో మంట వంటి సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ నీటిని తాగాల్సి ఉంటుంది.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

చిగుళ్లు ఆరోగ్యం కోసం:
రాక్ సాల్ట్‌ను తూత్ పౌడర్ గా కూడా వినియోగించవచ్చు. దీనిని వినియోగించడం వల్ల చిగుళ్ళు దృఢంగా మారడమే కాకుండా పంటిపై పేరుకుపోయిన వ్యర్ధపదార్థాలన్నీ సులభంగా తొలగిపోతాయి. అంతేకాకుండా చిగుళ్ళ నొప్పి, వాపు సమస్యలు కూడా దూరమవుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

కీళ్ల నొప్పులకు దివ్యౌషధం:  
ప్రస్తుతం చాలామంది కీళ్ల నొప్పులతో ఇలాంటి వారికి రాక్ సాల్ట్ ప్రభావంతంగా సహాయపడుతుంది. అయితే కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారు ప్రతి రోజు నొప్పి గల ప్రభావిత ప్రాంతంలో రాక్ సాల్ట్ తో కట్టు కట్టడం వల్ల గొప్ప ఉపశమనం పొందుతారు. ఇందులో ఉన్న గుణాలు చర్మ సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. కాబట్టి తరచుగా చర్మ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా వినియోగించవచ్చు.

Also Read: Bajaj Auto CNG Bikes: సూపర్ న్యూస్ చెప్పిన బజాజ్.. త్వరలో మార్కెట్‌లోకి సీఎన్‌జీ బైక్‌లు..!    

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News