Bleaching Side effects: సాధారణంగా కొంత మంది తరచూ ముఖానికి బ్లీచింగ్ చేస్తారు. దీంతో కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అవి కొంత మందికి త్వరగా కనిపిస్తాయి మరికొంత మందికి కొంత సమయం తర్వాత కనిపిస్తాయి. ముఖానికి బ్లీచింగ్ తరచూ ఉపయోగించడం సౌందర్య పరంగా అది ఒక ట్రీట్మెంట్. అయితే, అందులో కొన్ని కెమికల్స్ ఉంటాయి. తరచూ ఉపయోగించడం వల్ల ముఖంపై కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ ప్రభావాలు చూపిస్తాయి.
ముఖానికి తరచూ బ్లీచింగ్ చేయడం వల్ల దురద ఎరుపుదనం వస్తుంది ముఖ భాగంలో చికాకుగా అనిపిస్తుంది వాపు సమస్య కూడా రావచ్చు. కొంతమందికి మంటగా కూడా అనిపిస్తుంది. ముఖంపై ఈ రియాక్షన్ కనిపిస్తే బ్లీచింగ్ చేసుకోకపోవడమే మంచిది.
అలర్జీ..
కొంతమందికి బ్లీచింగ్ చేసుకోవడం వల్ల ఎలర్జీ సమస్యలు వస్తాయి. దురద, వాపు అందుకే బ్లీచింగ్ చేసుకునే ముందు ప్యాచ్ చేయడం మంచిది. బ్లీచింగ్ చేసుకోవడం వల్ల కొంతమందిలో మొఖం పొడిబారి పోతుంది ఇది చర్మంపై ఉన్న హైడ్రేషన్ తొలగిస్తుంది మాయిశ్చర్ ని కోల్పోతారు ముఖం కూడా డల్ గా కనిపిస్తుంది.
ఇదీ చదవండి: ఖాళీ కడుపుతో ఇంగువ నీరు తాగడం వల్ల శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు ..
పిగ్మెంటేషన్..
కొంతమందికి బ్లీచ్ పడకుంటే ముఖంపై హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలు మొదలవుతాయి. అందుకే బ్లీచింగ్ వాడేటప్పుడు ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. ఇందులో ఉన్న కెమికల్స్ ఇలాంటి ఫలితాలకు దారితీస్తుంది. దీంతో హైపర్ పిగ్మెంటేషన్ సమస్యలు రావచ్చు.
కెమికల్..
ఒక్కో సమయంలో బ్లీచ్ పడని వారికి కెమికల్ పరంగా మంటలు రావచ్చు నొప్పితో కూడిన మొటిమలు ఏర్పడతాయి చర్మం పొలుసులుగా రాలిపోతుంది. బ్లీచ్ ముఖానికి తరచూ వాడటం వల్ల మొఖం చర్మం సున్నితంగా మారిపోతుంది. దీంతో తరచుగా అలర్జీ సమస్యలు రావచ్చు.తరచూ బ్లీచింగ్ ఉపయోగించడం వల్ల ఆక్సైడ్ ఏజెంట్స్ శర్మ లేయర్ ను చిన్నగా సన్నగా చేస్తాయి.
ఇదీ చదవండి: మీ పాదాలను మృదువుగా మార్చే సహజసిద్ధమైన స్క్రబ్.. ఇలా తయారు చేసుకోండి..
వృద్ధాప్యం..
ముఖంపై త్వరగా వృద్ధాప్యలు కనిపిస్తాయి ముఖంపై మచ్చలు మొటిమలు నల్ల వలయాలు ఏర్పడతాయి
కెమికల్స్ లో వల్ల రక్తనాళాల్లోకి చేరి ఇవి చర్మసమస్యలకు దారితీస్తాయి.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి