Coconut Water Benefits: మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు చాలా రకాల మినరల్స్, విటమిన్స్ అవసరమౌతాయి. దాదాపు అన్ని రకాల పోషకాలు ఒకే దాంట్లో ఉండటం చాలా అరుదు. అలాంటివే కొబ్బరి నీళ్లు. ఇందులో ఎలక్ట్రోలైట్స్ సహా చాలా రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే కొబ్బరి నీళ్లు అన్ని రోగాలకు మంచి మెడిసిన్ అని చెప్పవచ్చు.
కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. కొబ్బరి నీళ్లతో ఆరోగ్యపరంగా ప్రయోజనాలే కాకుండా చర్మ సంరక్షణకు సైతం అద్భుతంగా ఉపయోగపడుతుంది. కొబ్బరి నీళ్లతో చర్మాన్ని అద్భుతంగా పరిరక్షించుకోవచ్చు. కొబ్బరి నీళ్లను ముఖానికి అప్లై చేయడం ద్వారా ఔషదంలా పనిచేస్తాయి. ముఖాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. చర్మంపై ముడతల్లేకుండా చేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా చర్మంపై మచ్చలు, మరకలు తొలగించడంలో అద్బుతంగా ఉపయోగపడతాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు..ఫ్రీ రాడికల్స్ నాశనం చేయడంలో దోహదం చేస్తాయి. కొబ్బరి నీళ్లను ఉపయోగించడం ద్వారా చర్మం మరింతగా నిగనిగలాడుతుంది.
కొబ్బరి నీళ్లలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ముఖంపై పింపుల్స్, యాక్నే రాకుండా అడ్డుకుంటాయి. చర్మ కణాలు మూసుకుపోకుండా, బ్యాక్టీరియా పెరగకుండా చేస్తాయి. అంతకంటే ముఖ్యంగా కొబ్బరి నీళ్లు సన్ స్క్రీన్‌లా పనిచేస్తాయని చాలామందికి తెలియదు. చర్మాన్ని సూర్య కిరణాల్నించి కాపాడతాయి. సన్‌బర్న్ కాకుండా చేస్తాయి. ఇందులో ఉండే విటమిన్లు, ఖనిజాలు, ఇతర పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మానికి నిగారింపు ఇస్తాయి.
ముఖానికి కొబ్బరి నీళ్లు రాసే విధానాలు చాలానే ఉన్నాయి. నేరుగా ముఖానికి రాసుకోవచ్చు. లేదా మరేదైనా పదార్ధంతో కలిపి రాయవచ్చు. దూదిని కొబ్బరి నీళ్లలో ముంచి ముఖానికి రాసుకోవాలి. ఓ 10 నిమిషాల తరువాత నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. ఇలా రోజూ చేస్తే 3-4 వారాల్లోనే ఫలితం చూడవచ్చు.
Also read: Interview Tips: ఇంటర్వ్యూలో ఏయే పొరపాట్లు చేయకూడదు, ఇంటర్వ్యూ ఎలా ఎదుర్కోవాలి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook