Coriander Seeds For Bad Cholesterol: శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీయవచ్చు. ముఖ్యంగా గుండె సమస్యలు మధుమేహం వంటి ప్రాణాంతక వ్యాధులకు గురి కావచ్చు. కాబట్టి కొలెస్ట్రాల్ అదుపులో ఉంచుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది. అంతేకాకుండా ఈ సమస్యలు ఉన్నవారు ఉపశమనం పొందడం కూడా ఆరోగ్యానికి చాలా మంచిది లేకపోతే దీర్ఘకాలిక ప్రాణాంతక వ్యాధుల బారిన పడే అవకాశాలు అధికమని ఆరోగ్యానికి నిపుణులు చెబుతున్నారు. ఈ చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి పలు రకాల ఔషధం మూలికలను కూడా వినియోగించాల్సి ఉంటుంది.
వంటకాల రుచిని పెంచే కొత్తిమీరతో కూడా ఈ చెడు కొలెస్ట్రాల్ మంచి ఉపశమనం పొందవచ్చు. అయితే దీనికోసం ప్రతిరోజు మీరు కొలెస్ట్రాల్ తగ్గించుకోవడానికి కొత్తిమీరతో తయారుచేసిన టీ ని తాగాల్సి ఉంటుంది. కొత్తిమీర ఆకులతో కాకుండా గింజలతో కూడా అంతే ప్రయోజనాలు ఉంటాయి. ఈ గింజలను పొడిలా చేసుకుని గ్రీన్ టీ తయారీలో క్రమంలో వినియోగించి.. ఈటీవీ రోజు రెండు నుంచి మూడుసార్లు తీసుకుంటే చెడు కొలెస్ట్రాల్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
ఈ కొత్తిమీర గింజల్లో శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇందులో విటమిన్ ఏ, విటమిన్ సి, బీటా కెరోటిన్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి శరీరంలో కొలెస్ట్రాల్ సులభంగా తగ్గించేందుకు సహాయపడతాయి.
కొత్తిమీర గింజల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలు:
పొట్టలో సమస్యలు తగ్గుతాయి:
ఆధునిక జీవన శైలి కారణంగా చాలామంది వివిధ రకాల అనారోగ్యక ఆహారాలను తీసుకొని పొట్ట సమస్యల బారిన పడుతున్నారు. అయితే దీనికోసం కొత్తిమీర గింజలను ఉపయోగించవచ్చు. ఇందులో ఉండే పోషకాలు గ్యాస్, డయేరియా, మలబద్దకం, ఉబ్బరం వంటి సమస్యలను సులభంగా తగ్గిస్తుంది.
డయాబెటిస్ తో వ్యాధి వారు:
డయాబెటిస్తో బాధపడుతున్న వారికి కూడా కొత్తిమీర గింజలు ప్రభావంతంగా పనిచేస్తాయి. ఇందులో చెడు కొలెస్ట్రాల్ను తగ్గించే మూలకాలు అధిక పరిమాణంలో లభిస్తాయి కాబట్టి.. మధుమేహాన్ని కూడా సులభంగా నియంత్రిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉండే గుణాలు రక్తంలోని చక్కర పరిమాణాలను తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మ, జుట్టు సమస్యలు:
వాతావరణంలో కాలుష్యం మార్పుల వల్ల చర్మంపై వివిధ సమస్యలు వస్తున్నాయి. అయితే ఈ సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందడానికి కొత్తిమీరతో తయారుచేసిన మాస్క్ ను వినియోగించాల్సి ఉంటుంది. చర్మ సమస్యలు ఉన్నవారు ఈ మాస్క్ ను క్రమం తప్పకుండా వినియోగిస్తే.. సులభంగా ఉపశమనం పొందుతారు.
Also read: Munugodu bypolls 2022: మునుగోడు ఉపఎన్నికకు నేటి నుంచే నామినేషన్లు
Also read: Indian Airforce Day: ప్రతి సంవత్సరం ఎయిర్ ఫోర్స్ డేను ఎందుకు జరుపుకుంటారో తెలుసా..?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook