Dark Chocolate Benefits: రోజూ ఒక డార్క్‌ చాక్లెట్‌ తింటే శరీరానికి ఇన్ని లాభాలా..?

Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు చేకూరుతాయి ముఖ్యంగా స్త్రీలకు అయితే పీరియడ్స్ టైమ్స్ లో వచ్చే నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం కలుగుతుంది కాబట్టి తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి..  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2022, 08:55 PM IST
Dark Chocolate Benefits: రోజూ ఒక డార్క్‌ చాక్లెట్‌ తింటే శరీరానికి ఇన్ని లాభాలా..?

Dark Chocolate Benefits: ఇంట్లో ఏ పండగ అయినా సరదాగా మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీగా వస్తోంది. చాలామంది పుట్టినరోజు వేడుకల్లో కానీ ఇతరు ఏ వేడుకల్లోనైనా మిఠాయిలు, చాక్లెట్లు పంచుతూ ఉంటారు. బ్రిటిష్ కాలం నుంచి భారతీయులు కొన్నిచోట్ల డార్క్ చాక్లెట్స్ ను కూడా పంచుతూ వస్తున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే గుణాలు శరీరానికి చాలా రకాల ప్రయోజనాలను అందజేస్తాయి. చాలామంది వీటిని తినడం వల్ల శరీరానికి హాని కలుగుతుందని అనుకుంటారు. అంతేకాకుండా ఇందులో చక్కెర పరిమాణాలు మధుమేహానికి కూడా దారి తీయొచ్చని అప్పుడప్పుడు ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. ఇలా సందేహాలతో సతమతమవుతున్న వారు తప్పకుండా ఈ స్టోరీతో క్లారిటీ తెచ్చుకోవచ్చు. చాక్లెట్ లో ఉండే మూలకాలు శరీరానికి లాభాలను చేకూర్చే విధంగానే ఉంటాయి. కాబట్టి చాక్లెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని కలగదు.

గర్భాధారణ సమయంలో చాక్లెట్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు:
గర్భాధారణ సమయంలో చాక్లెట్ తినడం వల్ల శరీరానికి చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి ముఖ్యంగా శరీరంలో ఉండే ఫ్రీ-రాడికల్స్ ను నియంత్రించి వ్యాధుల నుంచి రక్షిస్తుంది. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు రాకుండా శరీరాన్ని రక్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి గర్భాధారణ సమయంలో తప్పకుండా చాక్లెట్స్ తినడం మంచిది.

ఒత్తిడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది:
డార్క్ చాక్లెట్‌లో సెరోటోనిన్ అనే రసాయనం కాబట్టి తరచుగా ఒత్తిడికి గురవుతున్న వారు డార్క్ చాక్లెట్స్ తినడం వల్ల మైండ్కు ప్రశాంతత లభిస్తుంది. అంతేకాకుండా ఒత్తిడి నుంచి ఉపశమనం లభించి ప్రశాంతత కలగజేస్తుంది. 

డార్క్ చాక్లెట్ గుండెకు చాలా మంచిది:
ప్రతిరోజు రెండు లేదా ఒకటి డార్క్ చాక్లెట్ తినడం వల్ల గుండె జబ్బుల నుంచి ఉపశమనం కలిగిస్తుందని ఇటీవల అధ్యయనాల్లో పేర్కొన్నారు. అంతేకాకుండా ఇందులో ఉండే గుణాలు గుండెను ఫీట్ గా చేసేందుకు కూడా సహాయపడతాయని అందులో తెలిపారు.
 
పీరియడ్స్ నొప్పిని తగ్గిస్తాయి:
ప్రతి నెలలో స్త్రీలకు పీరియడ్స్ నొప్పులు రావడం సహజం. అయితే ఇలాంటి నొప్పులతో బాధపడుతున్న వారు తప్పకుండా రోజుకు ఒక డార్క్ చాక్లెట్ తినాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇది నొప్పిని తగ్గించడమే కాకుండా చాలా రకాల ప్రయోజనాలను చేకూర్చుతుంది. కావున తప్పకుండా డార్క్ చాక్లెట్ ని తినాలి.

Also Read: 7th pay commission: కేంద్ర ఉద్యోగులకు మరో బంపర్ గిఫ్ట్.. ట్రావెల్ అలవెన్స్ పెంపు

Also Read: Hyderabad Metro: మెట్రో రెండో దశకు వేగంగా అడుగులు.. నగర ఎమ్మెల్యేలకు మంత్రి కేటీఆర్ పిలుపు   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News