How To Get Rid Of Black Neck Overnight: ముఖం అందగా కనిపించేందేకు చాలా మంది ఖరీదైన సౌందర్య సాధనాలు వినియోగిస్తూ ఉంటారు. ఇలా ఉపయోగించడం వల్ల ముఖం మెరిసేలా తయారైనప్పటికీ, చాలా మంది మెడలపై అలాగే మురికి ఉండిపోతోంది. దీని కారణంగా మెడపై నల్లగా తయారవుతోంది. అయితే దీని కారణంగా ముఖం అదంగా కనిపించినప్పటికీ, మెడ మాత్రం చాలా నల్లగా కనిపిస్తోంది. ఈ సమస్య బారిన పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా పడుతున్నారు. డార్క్ నెక్ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి మార్కెట్‌లో లభించే చాలా రకాల ఖరీదైన క్రీములను వినియోగిస్తున్నారు. అయినప్పటికీ ఈ సమస్య నుంచి ఉపశమనం పొందలేకపోతున్నారు. మీరు కూడా ఈ డార్క్ నెక్ సమస్యతో బాధపడుతుంటే తప్పకుండా ఈ ఇంటి చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. వీటిని వినియోగించడం వల్ల సులభంగా ఈ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
డార్క్ నెక్ నుంచి ఇలా ఉపశమనం పొందండి:
దోసకాయ:
దోసకాయ ఆరోగ్యానికి, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో శరీరానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు లభిస్తాయి. దోసకాయ మిశ్రమాన్ని శరీరానికి అప్లై చేయడం వల్ల మృతకణాలు తొలగిపోయి. అంతేకాకుండా చర్మం నిగనిగలాడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే ఈ మిశ్రమం డార్క్ నెక్‌కి కూడా ఎంతో ప్రభావంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. డార్క్ నెక్ ఉన్నవారు..మెడపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల డార్క్ నెక్ నుంచి ఉపశమనం లభిస్తుంది.
శనగపిండి, నిమ్మరసం:
శనగపిండి, నిమ్మరసం మిశ్రమం కూడా డార్క్ నెక్‌కి ప్రభావంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా ఒక గిన్నెను తీసుకోవాల్సి ఉంటుంది. అందులో 3 టీ స్పూన్ల నిమ్మ రసం వేసుకుని 2 టీ స్పూన్ల శనగపిండిని కలిపి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ పేస్ట్‌ను మెడపై అప్లై చేసి 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచాలి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
బంగాళాదుంప:
బంగాళాదుంప మిశ్రమం కూడా డార్క్ నెక్‌కి ప్రభావంతంగా సహాయపడుతుందని సౌందర్య నిపుణులు తెలుపుతున్నారు. ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ముందుగా బంగాళాదుంప మిశ్రమం తీసుకోవాలి. ఇందులోనే 2 టీ స్పూన్ల నిమ్మరసం కలిపి నెక్‌కి పట్టించాల్సి ఉంటుంది.
అలోవెరా:
అలోవెరా మీ మెడ ఉన్న చర్మాన్ని మెరుగుపరిచేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. ఈ అలోవెరాను వినియోగించాలనుకునేవారు ముంగా ఈ గిన్నె తీసుకుని అందులో కలబంద జెల్‌ను కలపాల్సి ఉంటుంది. అయితే ఇందులో 2 టీ స్పూన్ల నిమ్మరసం మిక్స్ చేసుకుని మెడకు అప్లై చేసి 5-6 నిమిషాలు మసాజ్ చేయండి.
Also Read: Etela Rajender: ఓడిపోతే పోరాడి ఓడిపోవాలి.. లొంగేది లేదు.. కొట్లాడేందుకు రెడీ: ఈటల రాజేందర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook