డియర్ జిందగీ : మీరు చూసే దృష్టి కోణం, నడవడిక మీకు ఏం చెబుతున్నాయి ?

ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నడవడిక కన్నా గొప్పది ఇంకొకటి లేదు. చూసే దృష్టి కోణం కన్నా గొప్ప క్వాలిఫికేషన్ మరొకటి లేదు.

Last Updated : Jun 15, 2018, 08:10 PM IST
డియర్ జిందగీ : మీరు చూసే దృష్టి కోణం, నడవడిక మీకు ఏం చెబుతున్నాయి ?

దయాశంకర్ మిశ్రా, డిజిటల్ ఎడిటర్, జీ న్యూస్ హిందీ

దృష్టి కోణం, నడవడిక... నాకు తెలిసినంత వరకు ఇంత కన్నా మంచి అర్థవంతమైన పదాలు మరొకటి లేవు. ఎందుకంటే దేనినైనా సరే మనం చూసే దృష్టినిబట్టే ఉంటుంది కనుక. మనకు ఉన్న అర్హతలు, బలాబలాలు, నిర్ణయం తీసుకోవడంలో ఉన్న చాకచక్యం వంటివన్నీ మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఆ కష్టాలని అధిగమించి ముందుకెళ్లేందుకు దోహదపడతాయి. కానీ, మనం ఎక్కడికైనా చేరుకోవడానికైనా లేక చేరుకోలేకపోవడానికైనా.. పెద్ద తేడా ఏదైనా ఉందా అంటే అది కేవలం అంటే కేవలం మనం చూసే దృష్టి కోణం వల్లే అని గ్రహించాలి. 

ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో నడవడిక కన్నా గొప్పది ఇంకొకటి లేదు. చూసే దృష్టి కోణం కన్నా గొప్ప క్వాలిఫికేషన్ మరొకటి లేదు. మనకు తెలియకుండానే మనలో ఉన్న ఓ సహజమైన గుణం అది. ఒకే వాతావరణంలో, ఒకే రకమైన పరిస్థితుల్లో ఇద్దరు వ్యక్తులు వేర్వేరుగా ఆలోచిస్తున్నారంటే, అందులో ఉన్న ఏకైక తేడా వారు చూసే దృష్టి కోణం వేర్వేరుగా ఉండటమే. కొంతమంది కష్టాలు దాటుకుని ముందుకెళ్లి విజయాలు సాధిస్తే ఇంకొంతమంది అక్కడే ఆగిపోతారు.  

ఇందులో ఎంతమేరకు వాస్తవం ఉందో తెలుసుకోవడానికి ఓ మార్గం ఉంది. మీకు ఓ పదేళ్ల నుంచి బాగా తెలిసిన మీ స్నేహితులపై ఓ కన్నేయండి. అప్పట్లో మీకు తెలిసి, అప్పట్లో వాళ్లు మాట్లాడినట్టుగానే ఇప్పుడూ ఉన్నారా ? లేక వాళ్లు వెళ్తున్న దారికి అప్పుడు వాళ్లు చెప్పిన మాటలకు ఏమైనా తేడా ఉందా అని గ్రహించండి. అప్పుడే మీకు అర్థమైపోతుంది. ఎక్కువ సందర్భాల్లో మనం ఎలా ఆలోచిస్తామో.. ఎలా ప్రవర్తిస్తామో.. ఎలా నిర్ణయాలు తీసుకుంటామో.. అందుకు తగినట్టుగానే మన జీవితం ఉంటుంది. 

మన స్నేహితుల్లో కొందరు ఆత్మవిశ్వాసం కలిగిన వాళ్లయితే, ఇంకొంతమంది మూడ విశ్వాసాలపై నమ్మకం ఉండేవాళ్లుంటారు. ఇంకా కొంతమంది అసలు ఏం చేయాలన్నా.. ఏదో ఓ సందేహంతో కొట్టుమిట్టాడే వాళ్లుంటారు. వాళ్లు ఎందుకలా ఉన్నారంటే అందుకు కారణం వాళ్లు పెరిగిన వాతావరణం, చుట్టూ ఉన్న వాతావరణం ఒక ఎత్తైతే, ఆ తర్వాత వాళ్లు పరిస్థితులను ఎలా స్వీకరించారనేది మరో కారణం. 

ఇదిగో దృష్టికి సంబంధించి ఇంకొ చక్కటి సాధారణ ఉదాహరణ చెప్పాలంటే అది పెళ్లి అనే అనుకోవచ్చు. భారతీయ సంప్రదాయం ప్రకారం జరిగే పెళ్లిళ్లే మన దృష్టి కోణానికి చక్కటి ఉదాహరణలు. పెళ్లిలో అమ్మాయి తండ్రిని సంప్రదాయం పేరిట వరకట్నం కోసం గొంతెమ్మ కోరికలు కోరుతుంటే, యువత మాత్రం చేష్టలుడిగి మౌనంగా చూస్తూ ఉండిపోతోంది. కానీ ఎవ్వరైనా ఒకరు ముందుకొచ్చి, అలా జరగడానికి వీల్లేదు అని గట్టిగా చెప్పిన సందర్భాలు లేవు. మనచుట్టుపక్కల జరిగే పెళ్లిళ్లలో 99% జరిగేది ఇదే. పైగా ఇక్కడ యువత చెప్పేది ఏంటంటే... అమ్మాయి తండ్రిదండ్రులు పాత సంప్రదాయాన్నే అనుసరిస్తున్నారు కానీ అంతకుమించి ఇందులో ఇంకేం లేదు. అందుకే మౌనంగా ఉన్నాం అని. ఈ కారణంగానే భారత్‌లో మహిళల జీవితాల్లో, వారి సామాజిక పరిస్థితుల్లో ఆశించినంత అభివృద్ధి కనిపించడం లేదు. చదువులు, ఉన్నత చదువులు ఎంత చదువుకున్నా ఇంకా యువత చూసే దృష్టి కోణంలో ఇంకెంతో మార్పు రావాల్సి ఉంది. 

సరే వేరే వాళ్ల విషయాలు పక్కనపెడుదాం. మీరే మీ జీవితాలను ఓసారి పరిశీలించుకోండి. ఇవాళ మీరు సాధించింది ఏదైనా ఉందా అంటే అందుకు దోహదపడింది ఏంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, ముందుగా మీ కళ్ల ముందు మెదిలేది మీ లక్ష్యంపై మీకున్న దృష్టి, నడవడికనే కదా!! మీరు సాధించినది ఏమైనా ఉంటే దాని క్రెడిట్ అంతా మీరు చూసే దృష్టికోణం, మీ నడవడిక వల్లే సాధ్యమైందని తెలుసుకోండి. అంతకు మించి ఇంకేం లేదు.

ఈ ఆర్టికల్‌ని హిందీలో చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి :- डियर जिंदगी : आपका नजरिया क्‍या कहता है…

सभी लेख पढ़ने के लिए क्लिक करें : डियर जिंदगी

(https://twitter.com/dayashankarmi)

(ఈ ఆర్టికల్‌పై మీ సలహాలు, సూచనలు తెలియచేయండి: https://www.facebook.com/dayashankar.mishra.54)

Trending News