Diabetes Control With Salad in 7 Days: మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా వారు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అంతేకాకుండా వీరు కొన్ని సందర్భాల్లో రుచి కరమైన ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే మధుమేహాన్ని సులభంగా నియంత్రించుకునేందుకు ప్రతి రోజూ తీసుకునే ఆహారంలో డైట్ పాటించడం చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అంతేకాకుండా జీవన శైలిలో మార్పులు వల్ల కూడా రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గించుకోవచ్చు. అయితే వీరు భోజనం క్రమంలో పలు రకాల ఆహారాలు ప్రతి రోజు తీసుకుంటే మధుమేహానికి శాశ్వతంగా చెక్ పెట్టొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అంతేకాకుండా చాలా రకాల అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎలాంటి ఆహారాలు తీసుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతి రోజూ ఈ సలాడ్స్‌ను తీసుకోండి:
మెక్సికన్ వెజిటబుల్ సలాడ్స్ ప్రతి రోజూ తీసుకుంటే మధుమేహం నుంచి సులభంగా ఉపశమనం పొందవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే దీనిని తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు:
డ్రెస్సింగ్ కోసం:
- ఆలివ్ నూనె 2 టేబుల్ స్పూన్లు
- తరిగిన కొత్తిమర తురుము
- 2 వెల్లుల్లి రెబ్బలు, లవంగాలు
- 2 టీస్పూన్ల ఒరేగానో
- 3 టేబుల్ స్పూన్లు నిమ్మరసం
- జీలకర్ర పొడి 3/4 టీస్పూన్
- మిరపకాయలు 1/4 టీస్పూన్
సలాడ్ కోసం:
- 200 గ్రా. పాలకూర
- 1/4 కప్పు మొక్కజొన్న
- 1/2 కప్పు ఉడకబెట్టిన బీన్స్
- 2 చిన్న సైజు బెల్ పెప్పర్స్
తయారు చేసుకునే పద్దతి:
- ఒక గిన్నెల ఆలివ్ ఆయిల్, కొత్తిమీర, వెల్లుల్లి, ఒరేగానో, నిమ్మరసం, జీలకర్ర వేసి.. మిరపకాయలు వేసి బాగా మిక్స్ చేసుకోండి.
- ఆ తర్వాత పాలకూర, టమోటాలు, బెల్ పెప్పర్స్, మొక్కజొన్న, బీన్స్‌ను వేయాలి. వీటన్నిటినీ టాస్ చేసుకోవాల్సి ఉంటుంది.
- రుచికరమైన మెక్సికన్ సలాడ్ సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉంది.
Also Read: Nani Sister Deepthi : సెట్‌లో హీరోయిన్లతో నాని అక్క అలా చేయించుకుందా?.. సినిమా ఆఫర్ కోసం ఇలానా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook