Disadvantages of eating Paneer: ఇంట్లో పండగ వచ్చి అందులో పనీర్ కర్రీ తప్పని సరిగా ఉండాల్సింది. ఈ కూర లేకుండా పండగలన్నీ అసంపూర్ణమేనని పూర్వీకులు చెబుతూ ఉంటారు. పనీర్ శరీరానికి కావాల్సిన ఫైబర్, ప్రోటీన్, ఫాస్పరస్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు అధిక పరిమాణంలో లభిస్తాయి. కాబట్టి వీటిని తరచుగా ఆహారాల్లో వినియోగిస్తారు. అయితే చాలా మంది నాన్‌వెజ్ తినని వారు పంక్షన్స్‌లో పన్నీర్‌ను తింటూ ఉంటారు. అయితే పన్నీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే పనీర్ ను అతిగా తినడం వల్ల చర్మంపై అలెర్జీ వంటి సమస్యలు రావొచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. అయితే వీటిని అతిగా తీసుకోవడం ఇతర సమస్యలు కూడా వచ్చే అవకాశాలున్నాయి. అవేంటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం..
అతిగా తీసుకుంటే ఈ సమస్యలు తప్పవు:
ఫుడ్ పాయిజనింగ్:
ప్రస్తుతం చాలా మంది ఫిజ్జాల్లో అతిగా పనీర్ కలిగిన వాటిని ఎక్కువగా తింటున్నారు. ఇలా చేయడం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. పనీర్‌ను అతిగా తీసుకోవడం వల్ల అందులో ఉండే ప్రొటీన్ల వల్ల వాంతులు, విరేచనాల సమస్య రావచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
చీజ్ వల్ల అలెర్జీ:
తరచుగా చాలా మంది అలెర్జీ సమస్యలతో బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు చీజ్‌ను ఆహారాల్లో అతిగా తీసుకోవడం వల్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వీటిని అతిగా తీసుకుంటే చాలా మంది చర్మంపై తీవ్ర సమస్యలు వచ్చి.. అలెర్జీ వంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలున్నాయి. కాబట్టి ఈ చీజ్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోకపోవడం చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.
రక్తపోటు:
పనీర్‌ను తీసుకోవడం వల్ల శరీర ఫిట్‌నెస్ పెరుగుతుంది. అంతేకాకుండా వీటిని అతిగా తీసుకోవడం వల్ల అధిక రక్త పోటు సమస్యలు వచ్చే అవకాశాలున్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కాబట్టి వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం మానుకోవాలి. పనీర్ అతిగా తీసుకుంటే కొందరిలో గుండె పోటు కూడా రావొచ్చు.
కడుపులో ఇన్ఫెక్షన్:
చాలా మంది పచ్చి పనీర్ తినడానికి ఇష్టపడతారు. ఇలా చేయడం సరికాదని వైద్యులు చెబుతున్నారు. పచ్చిగా తినడం వల్ల కడుపులోకి బ్యాక్టీరియా, వైరస్ పెరిగి తీవ్ర అనారోగ్య సమస్యలకు దారి తీసే అవకాశాలున్నాయి. కాబట్టి వీటిని తీసుకోకపోవడం చాలా మేలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
(NOTE: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం ఇంటి నివారణలు, సాధారణ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. దీనిని స్వీకరించే ముందు, దయచేసి వైద్య సలహా తీసుకోండి. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
Also Read : RC 15 : దిల్ రాజు టీం అశ్రద్ద.. రామ్ చరణ్ అంజలి పిక్స్ లీక్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook