Instant Remedy For Low Blood Pressure: వయసుతో సంబంధం లేకుండా లో- బీపీ సమస్య బారిన పడుతున్నారు. దీనికి కారణం పోషక ఆహార లోపం అని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. అసలు లో- బీపీ అంటే ఏంటి ? సాధారణంగా లో- బీపీని హైపోటెన్షన్ అని కూడా వైద్య పరిభాషలో పిలుస్తారు. రక్త ప్రవాహంలో ఒత్తిడి తగ్గినప్పుడు కలిగే పరిస్థితినే హైపోటెన్షన్ అని పిలుస్తారు.
అయితే ఈ రక్తపోటు అనేది రెండు విధాలుగా సూచిస్తారు. సాధా 120/80 కన్నా తక్కువలో బీపీ ఉంటే చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. దీని కన్నా తక్కువ సంఖ్య ఉంటే లో- బీపీ భారీ పడినట్లు గ్రహించాలి. దీని కారణంగా స్పృహ కోల్పోతారు. పెద్దవారిలో లో బీపీ ఉన్నప్పుడు హైపోటెన్షన్ 90/60 కన్నా తక్కువగా ఉంటే లో -బీపీ లక్షణాలను గుర్తించవచ్చు.
లో- బీపీ అంటే ఏమిటి?
రక్తపోటు 90/60mmHg లేదా అంతకంటే తక్కువగా ఉన్నప్పుడు దీని హైపోటెన్షన్ అని పిలుస్తారు. రక్తపోటు కొలత మిల్లీమీటర్ల పాదరసం MMHG ఉపయోగించి కొలుస్తారు.దీని కారణంగా మెదడు, గుండె వంటి అవయవాలకు రక్త సరఫరా తగ్గుతుంది. వివిధ అనారోగ్య సమస్యల బారిన పడాల్సి ఉంటుంది.
లో- బీపీ లక్షణాలు:
లో-బీపీ ఉన్నప్పుడు అలసట, వికారం, అధిక చెమట, స్పృహ కోల్పోవడం, గందరగోళం, నిరసం, తలతిరగడం వంటి సమస్యల బారిన పడుతుంటారు.
లో- బీపీ ఉన్నప్పుడు ఏం చేయాలి:
లో-బీపీ ఉన్నప్పుడు ఉప్పు కలిగిన ఆహార పదార్థాలు తీసుకోవాలి. తక్కువగా ఉప్పు తినడం వల్ల కూడా లో-బీపీ సమస్య బారిన పడుతారు. అంతేకాకుండా ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించాలి. నీరు ఎక్కువగా తాగాలి లో-బీపీ బారిన పడకుండా ఉంటారు. బాదం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. మీరు భోజనంతో పాటు కాఫీని తాగడం అలవాటుగా చేసుకోవాలి. అంతేకాకుండా తక్కువ వ్యవధిలో భోజనం చేయడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల లో-బీపీ సమస్య బారిన పడకుండా ఉండవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.
బీపీ నియంత్రణలో ఉప్పు నీరు తాగుతే చాలా మంచిది. దీంతో లో- బీపీ కంట్రోల్ అవుతుంది. ఒక గ్లాసు నీళ్లలో నిమ్మకాయ రసం తీసుకొని అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి తాగాలి. ఇలా చేయడం వల్ల బీపీ సమస్య నుంచి కొంత వరకు ఉపశమనం పొందవచ్చు. లో-బీపీ ఉన్నప్పుడు ఎలక్ట్రోలైట్ తీసుకోవడం చాలా మంచిది. దీని వల్ల ఉపశమనం పొందవచ్చు.
లో-బీపీ ఉన్నప్పుడు టోఫీ, చాక్లెట్ మొదలైన కొన్ని స్వీట్లు కూడా తీసుకోవచ్చు. రక్తపోటును నార్మల్ చేయడంలో సహాయపడుతుంది.
ఈ విధంగా లో-బీపీ సమస్యతో బాధపడుతున్నప్పుడు ఈ చిట్కాలను పాటించడం చాలా మంచిదని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు. మీరు కూడా ఈ సమస్యతో బాధపడుతున్నప్పుడు తప్పకుండా ఈ టిప్స్‌ను పాటించండి.
Also read: Geysers Usage: గీజర్ ను ఆన్ లో పెట్టేసి స్నానం చేస్తున్నారా...?.. మీరు ఈ రిస్క్ లో పడ్డట్లే..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter